newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రెండో టీ20: 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం

08-01-202008-01-2020 08:49:48 IST
Updated On 08-01-2020 12:12:39 ISTUpdated On 08-01-20202020-01-08T03:19:48.817Z08-01-2020 2020-01-08T03:18:06.170Z - 2020-01-08T06:42:39.164Z - 08-01-2020

రెండో టీ20: 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టుపై ఘనవిజయాన్ని సాధించింది. తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా రెండో టీ20లో విజయం సాధించి ఈ సిరీస్ లో 1-0 తేడాతో  టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.

143 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా లక్ష్యాన్ని మూడు వికెట్లు నష్టపోయి 17.3 ఓవర్లలలోనే ఛేదించింది. 4 ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీసిన నవదీప్ షైనీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ రెండు జట్ల మధ్య చివరి టీ20 పూణే వేదికగా జనవరి 10న జరగనుంది. 

ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. కేవలం 4.5 ఓవర్లలోనే ఆవిష్క- గుణతిలక జోడి 38 పరుగులు జోడించారు. ఈ జోడీని వాషింగ్టన్ సుందర్ వేరు చేశాడు. అక్కడి నుండి శ్రీలంక వరుస విరామాల్లో వికెట్స్ కోల్పోయింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక భారీ స్కోరు చేయలేకపోయింది.

కుశాల్ పెరీరా (34) తప్పా మిగిలిన ఆటగాళ్లు భారీ స్కోరు చేయలేకపోవడంతో శ్రీలంక ఓ మాదిరి స్కోరు చేయగలిగింది. చివరి ఓవర్ లో బుమ్రా బౌలింగ్ లో హసరంగా (16 నాటౌట్) వరుసగా హ్యాట్రిక్ ఫోర్స్ కొట్టడం శ్రీలంక ఇన్నింగ్స్ లో ప్రత్యేకంగా నిలిచింది. గాయం కారణంగా క్రికెట్ కు కొద్దీ రోజులు దూరంగా ఉన్న బుమ్రా పునరాగమనం చేసిన ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి 32 పరుగులు ఇచ్చి ఒకే ఒక వికెట్ తీశాడు. శార్దూల్ ఠాకూర్‌కు మూడు, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీకి రెండేసి వికెట్లు దక్కాయి. సుందర్‌ ఒక వికెట్ తీశాడు. 

143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టుకు ఓపెనర్లు రాహుల్-ధవన్ కళ్ళు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. వీరి జోరుతో టీమిండియా ఆరు ఓవర్లు ముగిసే సమయానికి 54 పరుగులకు చేరింది. రాహుల్ దూకుడుగా ఆడుతుండటంతో అతనికి ధవన్ చక్కని సహకారాన్ని అందించాడు. ఈ జోడి 71 పరుగులు జోడించిన తరువాత హసరంగా బౌలింగ్ లో రాహుల్(45) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆ వెంటనే ధవన్(32)ని కూడా హసరంగా ఔట్ చేశాడు. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్-కోహ్లీ భారీ షాట్లతో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ జోడి దూకుడుతో టీమిండియా లక్ష్యానికి చేరువు అయింది. శ్రేయస్(34) జట్టు స్కోరు 137 పరుగుల వద్ద వెనుదిరిగినా పంత్ (1) తో కలిసి కోహ్లీ(30) జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle