facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
* తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ .. నామినేషన్లకు శ్రీకారం ..నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 25వ తేదీ* రక్షణమంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి సహా పలువురి నివాళి * ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ *మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి *సెన్సార్ బోర్డు పై వర్మ సీరియస్... కోర్టుకెళతానన్న ఆర్జీవీ*కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్

రెండో టీ20: భారత్ మహిళల టీంకు చుక్కెదురు

07-03-201907-03-2019 16:35:05 IST
2019-03-07T11:05:05.079Z07-03-2019 2019-03-07T11:04:59.038Z - - 18-03-2019

 రెండో టీ20: భారత్ మహిళల టీంకు చుక్కెదురు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన భారత మహిళల టీ20 జట్టుకి నిరాశే ఎదురైంది. గౌహతి వేదికగా ఇంగ్లండ్‌ మహిళలతో జరిగిన రెండో టీ20లో భారత్ పరాజయం పాలైంది. 112 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ మహిళలు 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను ఇంకా ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో ఇంగ్లాండ్ చేజిక్కుంచుకుంది. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్ బీమౌంట్ (8), జోన్స్ (5), స్కివెర్ (1), నైట్ (2) అవుట్ అయినా.. మరో ఓపెనర్‌ డానియల్లీ వ్యాట్‌ (64 నాటౌట్) అర్ధ సెంచరీతో పరుగుల వరద సాధించింది. వ్యాట్‌కి తోడుగా లారెన్‌ విన్‌ఫీల్డ్‌ (29; 23 బంతుల్లో 4 ఫోర్లు) నిలవడంతో ఇంగ్లండ్‌ ఈజీగా గెలుపు సాధించింది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ 2 వికెట్లు తీయడం విశేషం.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు చేసిన భారత మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేశారు. భారత మహిళలలో మిథాలీ రాజ్‌ (20) టాప్ స్కోరర్. మంధాన (12), హర్లీన్‌ డియాల్‌ (14), దీప్తి శర్మ (18), భారతి ఫుల్మాలి (18) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రంట్‌ మూడు వికెట్లు పడగొట్టింది. డానియల్లీ వ్యాట్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle