newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రెండు ఇన్నింగ్స్ లు కూడా సాగని ఇంగ్లండ్... పాక్ టెస్ట్

18-08-202018-08-2020 09:48:41 IST
2020-08-18T04:18:41.272Z18-08-2020 2020-08-18T04:16:45.685Z - - 15-04-2021

రెండు ఇన్నింగ్స్ లు కూడా సాగని ఇంగ్లండ్... పాక్ టెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని అతాల‌కుత‌లం చేస్తున్న త‌రుణంలోనూ ప్ర‌త్యేక ఏర్పాట్ల మ‌ధ్య నిర్వ‌హిస్తున్న ఇంగ్లండ్‌, పాకిస్థాన్ టెస్టు సిరీస్‌ను వ‌రుణుడు వ‌ద‌ల‌డం లేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఓ రోజు ఆట‌ను మింగేసిన వ‌ర్షం.. రెండో టెస్టులో కనీసం రెండు ఇన్నింగ్స్‌ల ఆట కూడా సాగలేదు. 

తొలి రోజు స‌గం ఆట వ‌రుణుడి కార‌ణంగా నిలిచిపోగా.. రెండో రోజు కూడా అదే క‌థ కొన‌సాగింది. మూడో రోజు అయితే ఒక్కబంతి కూడా పడలేదు.నాలుగో రోజు కేవలం 10.2 ఓవర్లు మాత్రమే పడ్డాయి. మ్యాచ్‌ చివరి రోజు, సోమవారం కూడా వర్షం వెంటాడింది.

వర్షం వెంటాడిన‌ రెండో టెస్టు పేలవమైన డ్రాగా ముగిసింది.సోమవారం ఉదయం వర్షం, ఆ తర్వాత పిచ్‌ చిత్తడిగా మారడంతో తొలి రెండు సెషన్ల ఆట వీలు కాలేదు. చివరికి మైదానాన్ని సిద్ధం చేయడంతో.. టీ బ్రేక్‌ తర్వాత ఇరు జట్లు బరిలోకి దిగాయి. అయితే 36 ఓవర్ల ఆట తర్వాత ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. 

ఓవర్‌నైట్‌ స్కోరు 7/1తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌.. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో 110/4 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ఈ స్థితిలో రెండు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (53) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సిబ్లేతో కలిసి క్రాలే రెండో వికెట్‌కు 91 పరుగులు జత చేశాడు. అయితే వీళ్లిద్దరూ రెండు ఓవర్ల తేడాతో ఔట్‌ కావడంతో ఇంగ్లండ్‌ 92/3తో నిలిచింది.

ఈ రెండు వికెట్లను పేసర్‌ మహ్మద్‌ అబ్బాస్‌ (2/28) ఖాతాలో వేసుకున్నాడు. పోప్‌ (9) కూడా త్వరగానే ఔటయ్యాడు. కెప్టెన్‌ రూట్‌ (9).. బట్లర్‌ (0)తో కలిసి నాటౌట్‌గా నిలిచాడు. వర్షం కారణంగా రెండు జట్లు కూడా రెండో ఇన్నింగ్స్‌ ఆడే అవకాశం లేకుండా పోయింది. మొహమ్మద్ రిజ్వాన్‌ (72) ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

అంతకుముందు పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. రిజ్వాన్‌ (72) టాప్ స్కోరర్. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టువర్ట్‌ బ్రాడ్‌ (4/56), అండర్సన్‌ (3/60) రాణించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టును గెలుచుకున్న ఇంగ్లీష్ జట్టు 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టు శుక్రవారం నుండి సౌథాంప్టన్‌లోనే ఆరంభం కానుంది.

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   12 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   16 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   a day ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14-04-2021


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle