newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రిటైరై మమ్మల్ని బతికించాడు.. లేకుంటే బలయ్యేవాళ్లం.. కుల్దీప్ సంచలన వ్యాఖ్య

04-07-202004-07-2020 09:47:02 IST
Updated On 04-07-2020 11:01:01 ISTUpdated On 04-07-20202020-07-04T04:17:02.145Z04-07-2020 2020-07-04T04:16:43.102Z - 2020-07-04T05:31:01.004Z - 04-07-2020

రిటైరై మమ్మల్ని బతికించాడు.. లేకుంటే బలయ్యేవాళ్లం.. కుల్దీప్ సంచలన వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏబీ డివిలియర్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడం మంచి పరిణామం అని భారత చైనామన్‌ స్పిన్నర్‌ (ఎడమచేతి మణికట్టు స్పిన్నర్‌) కుల్దీప్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. డివీలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించకపోతే తనలాంటి బౌలర్లు ఎంతోమంది అతడి చేతిలో బలయ్యే వాళ్లమని పేర్కొన్నాడు. ఇలా తాను కూడా ఏబీ డివిలియర్స్‌ బ్యాటింగ్‌ జోరు ముందు తేలిపోయిన బౌలర్‌నేనని చెప్పకనే చెప్పేశాడు. ఈ క్రమంలోనే డివిలియర్స్‌ బ్యాటింగ్‌కు భయపడ్డ పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. 

‘వన్డేల్లో ఏబీ ఎంతో విలువైన ఆటగాడు. అతనిది ప్రత్యేకమైన స్టైల్‌. ఇప్పుడు అతని బెంగలేదు... రిటైర్‌ అయిపోయాడు. ఇదొక మంచి పరిణామమే. మిగతా వారితో పోలిస్తే ఏబీ చాలా డేంజర్‌. నాకు డివిలియర్స్‌కు బౌలింగ్‌ చేయడమంటే కత్తిమీద సాములా ఉండేది. నన్ను అత్యంత భయపెట్టిన బ్యాట్స్‌మన్‌ ఏబీ. నా బౌలింగ్‌లో ఎదురుదాడి చేసి ఏబీ భారీగా పరుగులు సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి’ అని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో నిర్వహించిన క్రికెట్‌బాజీ లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో మాజీ క్రికెటర్‌ దీప్‌దాస్‌ గుప్తాతో పలు విషయాల్ని కుల్దీప్‌ షేర్‌ చేసుకున్నాడు.

అదే సమయంలో టెస్టుల్లో ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ బ్యాటింగ్‌ చాలెంజింగ్‌ ఉంటుందన్నాడు. ఎక్కవ బ్యాక్‌ ఫుట్‌లో ఆడటమే కాకుండా చాలా ఆలస్యంగా బంతిని ఆడటం తనకు సవాల్‌గా ఉండేదన్నాడు. ఇక 2019 ఐపీఎల్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, మొయిన్‌ అలీలు తనను చితక్కొట్టిన విషయాన్ని కూడా కుల్దీప్‌ గుర్తు చేసుకున్నాడు. కేకేఆర్‌ 10 పరుగుల తేడాతో ఓడిపోయిన ఆ మ్యాచ్‌లో కుల్దీప్‌ ఒక ఓవర్‌లో 27 పరుగులు సమర్పించుకున్నాడు. కోహ్లి, మొయిన్‌ల ధాటికి భారీగా పరుగులిచ్చాడు. 

అయితే ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే 2019 వరల్డ్‌కప్‌కు సిద్ధమైన విషయాన్ని కుల్దీప్‌ ప్రస్తావించాడు. ఐపీఎల్‌లో తాను చూసిన వైఫల్యాన్ని అధిగమించాలనే ఉద్దేశంతో వరల్డ్‌కప్‌కు సిద్ధమయ్యానన్నాడు.  దాంతోనే వరల్డ్‌కప్‌లో ఎక్కువ వికెట్లు సాధించకపోయినా, బౌలింగ్‌లో పరుగులు ఇవ్వకుండా ఆకట్టుకునే ప్రదర్శన చేశానన్నాడు.

తనదైన రోజున ఏ బౌలర్‌పైనైనా విరుచుకుపడటంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌కు సాటి మరొకరు ఉండరు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన డివిలియర్స్‌,.. మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనే యోచనలో ఉన్నాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ జరుగుంటే డివిలియర్స్‌ పునరాగమనం షురూ అయ్యేది.  ఈ మేరకు ఏబీతో దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు సంప్రదింపులు జరిపింది కూడా. అయితే వరల్డ్‌కప్‌ జరిగే అవకాశం లేకపోవడంతో ఏబీ రీఎంట్రీ అనేది డైలమాలో పడింది. ఇదే విషయాన్ని డివిలియర్స్‌ కూడా స్పష్టం చేశాడు. కరోనా వైరస్‌ తర్వాత చోటు చేసుకుని పరిస్థితుల్ని బట్టి, తన వయసు ఎంతవరకూ సహకరిస్తుందో అనే అంశాలపై తన రీఎంట్రీ ఉంటుందన్నాడు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle