newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాయుడు జట్టులో ఉండి ఉంటే వరల్డ్‌కప్‌ గెలిచేవాళ్లం.. రైనా వ్యాఖ్య

26-08-202026-08-2020 06:50:21 IST
Updated On 28-08-2020 13:33:35 ISTUpdated On 28-08-20202020-08-26T01:20:21.282Z26-08-2020 2020-08-26T01:20:17.527Z - 2020-08-28T08:03:35.893Z - 28-08-2020

రాయుడు జట్టులో ఉండి ఉంటే వరల్డ్‌కప్‌ గెలిచేవాళ్లం.. రైనా వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాదీ క్రికెటర్‌ అంబటి రాయుడు గనుక 2019- వరల్డ్‌కప్‌ జట్టులో ఉండి ఉంటే టీమిండియా తప్పకుండా కప్‌ గెలుచుకునేదని టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా అభిప్రాయపడ్డాడు. రాయుడు కష్టపడే తత్వం కలవాడని, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్థానానికి అతడే సరైన ఎంపిక అంటూ రైనా ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. 

2019లో జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ భారత జట్టులో చోటు కోసం ఎంతగానో ఎదురు చూసిన అంబటి రాయుడికి సెలక్టర్లు మొండిచేయి చూపిన సంగతి తెలిసిందే. అప్పటికి మెరుగైన రికార్డు ఉన్నప్పటికీ రాయుడిని పక్కనపెట్టి అతడి స్థానంలో విజయ్‌ శంకర్‌కు అవకాశమివ్వడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. 

ఇక ఈ తమిళనాడు క్రికెటర్‌ను ఎంపిక చేయడాన్ని సమర్థించుకుంటూ శంకర్‌ 3డీ ప్లేయర్‌(బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌) అంటూ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్ చేసిన కామెంట్స్‌పై రాయుడు కూడా అంతే ఘాటుగా స్పందించడం అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసింది. ఇక తాను వరల్డ్ కప్‌ని త్రీడీ కళ్లద్దాలు పెట్టుకుని చూస్తానంటూ అంబటిరాయుడు భారత క్రికెట్ జట్టు సెలెక్టర్లపై పంచ్ విసిరాడు.

ఈ నేపథ్యంలో విజయ్‌ శంకర్‌ గాయంతో తిరిగి స్వదేశానికి వచ్చిన్పటికీ మరోసారి రాయుడికి హ్యాండిచ్చిన సెలక్టర్లు.. రిషభ్‌  పంత్‌ను ఇంగ్లండ్‌కు పిలిపించారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించి.. కొన్నాళ్ల తర్వాత తన మాట వెనక్కి తీసుకున్నాడు. 

ఈ నేపథ్యంలో ఆనాటి పరిస్థితుల గురించి క్రిక్‌బజ్‌తో మాట్లాడిన సురేశ్‌ రైనా.. ‘‘ రాయుడు కష్టపడే తత్వం ఉన్నవాడు. తననెప్పుడూ నంబర్‌.4 ప్లేస్‌లో చూడాలని భావించేవాడిని. నిజానికి 2018 నాటి టూర్‌ను నేను ఏమాత్రం ఆస్వాదించలేకపోయాను. అప్పుడు రాయుడు ఫిట్‌నెస్‌ టెస్టులో విఫలం కావడంతో తన స్థానంలో నన్ను సెలక్ట్‌ చేయడం అంతగా నచ్చలేదు... 

అంతేకాదు ప్రపంచ కప్‌ సమయంలో కూడా తను జట్టుతో లేకపోవడం ప్రభావం చూపింది. ఒకవేళ తను ఉండి ఉంటే మనం టోర్నమెంట్‌ గెలిచేవాళ్లం. చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడే సమయంలో తన ఆటను దగ్గరగా గమనించాను. తనెంతో బాగా బ్యాటింగ్‌ చేస్తాడు’’ అని రాయుడికి విషయంలో సెలక్టర్లు వ్యవహరించిన తీరును పరోక్షంగా ప్రస్తావించాడు. 

భారత్ జట్టులో నంబర్ 4 స్థానంలో అంబటిరాయుడు అడాలని నేను భావించాను. ఎందుకంటే రాయుడ్ బాగా కష్టపడ్డాడు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు అదే స్థానంలో అతడు ఆడాడు. ఆ స్థానంలో నిజంగానే అతడు మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ చివరలో అతడిని వరల్డ్ కప్ జట్టులోనే స్థానం లేకుండా తప్పించారు అని రైనా ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇక 2019 వరల్డ్‌ కప్‌లో లీగ్ దశలో అగ్రగామిగా నిలిచిన భారత్‌ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి పాలై ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle