newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాణించని బ్యాట్స్‌మెన్లు.. తొలిరోజు కివీదే..

29-02-202029-02-2020 16:35:45 IST
Updated On 29-02-2020 16:39:29 ISTUpdated On 29-02-20202020-02-29T11:05:45.194Z29-02-2020 2020-02-29T11:05:42.968Z - 2020-02-29T11:09:29.489Z - 29-02-2020

రాణించని బ్యాట్స్‌మెన్లు.. తొలిరోజు కివీదే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌తో క్రైస్ట్‌చర్చ్ వేదికగా శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో కివీస్‌ తన హవాను కొనసాగిస్తోంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియాను 242 పరుగులకే ఆలౌట్ చేసిన న్యూజిలాండ్‌.. అనంతరం తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌(27 బ్యాటింగ్‌), టామ్‌ బ్లండెల్‌( 29 బ్యాటింగ్‌)లు క్రీజ్‌లో ఉన్నారు. మొదటి రోజు ఆటలో భారత్‌ 23 ఓవర్ల పాటు బౌలింగ్‌ వేసినా వికెట్‌ను కూడా సాధించలేకపోయింది.

దాంతో ప్రస్తుతానికి న్యూజిలాండ్‌దే పైచేయిగా కనబడుతోంది. న్యూజిలాండ్ ఇంకా 179 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడి ఉంది. రెండో రోజు భారత బౌలర్లు పుంజుకుని కివీస్‌ను త్వరగా ఆలౌట్‌ చేయకుంటే భారత్‌కు కష్టాలు తప్పవు.

అంతకముందు.. పృధ్వీషా(54), పుజరా(54), హనుమ విహారి(55) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 242 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. టాస్‌ ఓడి  బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌కు.. ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌ శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. ఇద్దరూ పరుగులు ఆచితూచి ఆడారు. జట్టు స్కోరు 30 పరుగుల వద్ద మయాంక్‌(7).. బౌల్ట్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగడంతో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. నయావాల్‌ పుజారాతో జతకలిసిన ఓపెనర్‌ పృధ్వీ(54) షా చెలరేగి ఆడాడు. వన్డే తరహాలో బ్యాటింగ్‌ చేసిన ఈ యువ ఆటగాడు 8 పోర్లు సాయంతో 54 పరుగులు చేసాడు. జట్టు స్కోర్‌ 80 పరుగుల వద్ద జేమిసన్‌ బౌలింగ్‌లో టామ్‌ లాథమ్‌కు క్యాచ్‌ ఔటైయ్యాడు. అనంతరం పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ(5)తో కలిసి పుజరా(54) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో టీమిండియా 85/2తో లంచ్‌కు వెళ్లింది.

భోజన విరామం అనంతరం విరాట్‌ కోహ్లి తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ.. సౌతీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వెస్‌కెప్టెన్‌ రహానే 7 పరుగులే చేసి ఔటవ్వడంతో 113 పరుగుల వద్ద భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. టీ విరామం తరువాత టీమిండియా తడబడింది. జేమిసన్‌ ధాటికి వరుస వికెట్లు కోల్పోయింది.

పుజారా ఔటైన తర్వాత రెండు బౌండరీలతో మెరుపులు మెరిపించిన పంత్‌(12) కూడా జెమీసన్‌ బౌలింగ్‌లోనే ఔటైయ్యాడు. ఆ తర్వాత ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ కూడా క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించలేదు. రవీంద్ర జడేజా(9), ఉమేష్‌ యాదవ్‌(0), మహ్మద్‌ షమి(16) ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో టీమిండియా 63 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్‌ 45 పరుగుల వ్యవధిలో చివరి ఐదు వికెట్లను కోల్పోవడం గమనార్హం. కివీస్‌ బౌలర్లలో జెమీసన్‌ 5 వికెట్లతో సత్తాచాటగా.. టిమ్‌ సౌతీ, ట్రెంట్‌ బౌల్ట్‌లు తలా రెండు వికెట్లు, నీల్‌ వాగ్నర్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle