newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాజీవ్ ఖేల్ రత్నకి రోహిత్ శర్మ

19-08-202019-08-2020 13:13:46 IST
2020-08-19T07:43:46.535Z19-08-2020 2020-08-19T07:43:31.210Z - - 15-05-2021

రాజీవ్ ఖేల్ రత్నకి రోహిత్ శర్మ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ‌ని ప్రతిష్ఠాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వరించబోతోంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు బాదిన రోహిత్ శర్మ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. 

అతని పేరుని ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఖేల్ రత్న అవార్డుకి సిఫార్సు చేసింది. రోహిత్ శర్మతో పాటు మరో నలుగురు అథ్లెట్స్ కూడా ఈ ఖేల్ రత్నకి ఎంపికయ్యారు. వాళ్లు ఎవరంటే..? ఆసియా గేమ్స్‌‌లో బంగారు పతకం సాధించిన రెజ్లర్ విగ్నేశ్ పొగట్, టేబుల్ టెన్నిస్ స్టార్ మణిక బత్రా, పారాలంపిక్ గోల్డ్‌ మెడలిస్ట్ మరిప్పన్ తంగవేలు, భారత ఉమెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ రాణీ రాంపాల్. 2016 రియో ఒలింపిక్స్ తర్వాత ఇలా నలుగురికి మించి అథ్లెట్స్ ఖేల్‌రత్నకి ఎంపికవడం ఇదే తొలిసారి.

నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఎంపిక కోసం మంగళవారం సెలక్షన్ ఫ్యానల్ మీటింగ్ జరిగింది. అందులో రాజీవ్ గాంధీ ఖేల్ రత్నతో పాటు అర్జున అవార్డు కోసం కూడా ఆటగాళ్లని ఎంపిక చేశారు.భారత క్రికెటర్లలో ఇప్పటి వరకూ కేవలం ముగ్గురు మాత్రమే ఈ రాజీవ్ గాంధీ ఖేల్‌ రత్న అవార్డుని అందుకున్నారు. తొలుత 1998లో సచిన్ టెండూల్కర్‌ని ఖేల్‌ రత్న వరించగా.. ఆ తర్వాత 2007లో మహేంద్రసింగ్ ధోనీకి ఆ గౌరవం దక్కింది. 

అనంతరం 2018లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించడం ద్వారా ఆ ఏడాదికి ఖేల్‌ రత్న‌ అవార్డుని అందుకున్నాడు.2019 వన్డే ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ ఏకంగా 648 పరుగులు చేసి.. ఒంటిచేత్తో టీమిండియాని సెమీ ఫైనల్‌కి చేర్చాడు.ఈ క్రమంలో ఐదు సెంచరీలు బాదిన రోహిత్ శర్మ.. ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక శతకాల నమోదు చేసిన క్రికెటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. భారత వన్డే, టీ20 జట్టుకి వైస్ కెప్టెన్‌గా ప్రస్తుతం కొనసాగుతున్న రోహిత్ శర్మ.

విరాట్ కోహ్లీ‌కి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అతని కెప్టెన్సీలోనే టీమిండియా ఆసియా కప్, నిదహాస్ ట్రోఫీ కూడా గెలిచింది.

 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle