newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాంచీ ముద్దుబిడ్డ... ధనా ధన్ ధోనీకి హ్యాపీ బర్త్ డే..

07-07-202007-07-2020 07:49:45 IST
Updated On 07-07-2020 07:50:08 ISTUpdated On 07-07-20202020-07-07T02:19:45.778Z07-07-2020 2020-07-07T02:19:25.210Z - 2020-07-07T02:20:08.210Z - 07-07-2020

రాంచీ ముద్దుబిడ్డ... ధనా ధన్ ధోనీకి హ్యాపీ బర్త్ డే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రికెట్ ప్రపంచంలో కెప్టెన్ గా మూడు ఐసీసీ టౌర్నమెంట్స్ గెలిచిన ఒకే ఒక్కడు అతడే మహీంద్రా సింగ్ ధోనీ. టీం ఇండియాలో బాధ్యత ఏదైనా అందులో తన మార్క్ చూపిస్తాడు. 1981 జులై 7 జన్మించిన ధోని 39 వ యేటలోకి అడుగు పెడుతున్నాడు. మహేంద్రసింగ్ ధోనీ.. ఎక్కడో రాంచీలోని ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి క్రికెట్ ప్రపంచాన్ని ఓ ఊపుఊపిన పేరిది. దశాబ్దన్నర క్రితం పవర్ హిట్టర్లు అంటే.. వెస్టిండీస్, ఆస్ట్రేలియా క్రికెటర్లనే ఎక్కువగా చూపించేవారు. కానీ.. విదేశీ క్రికెటర్లకి ఏమాత్రం తీసిపోని విధంగా బంతిని భారతీయులు కూడా బలంగా బాదగలరని ధోనీ నిరూపించాడు.

Image

కెరీర్‌ ఆరంభంలో జులపాల జట్టుతో ప్రత్యేక ఆకర్షణగా కనిపించిన ధోనీ భారీ సిక్సర్లు బాదుతుంటే..? పాకిస్థాన్ ప్రధాని సైతం ఫిదా అయిపోయి ప్రశంసలు కురిపించాడు. 2004 నుంచి టీమిండియాలో వికెట్ కీపర్, ఫినిషర్, కెప్టెన్, బౌలర్లకి సూచనలు, కెప్టెన్‌కి సలహాలివ్వడం.. ఇలా బాధ్యత ఏదైనా..? ధోనీ మార్క్ తప్పనిసరి. అందుకే ధోనీ అనేది కేవలం పేరు కాదు.. అది ఒక బ్రాండ్ గా మారిపోయింది.

డిసెంబరు 23, 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన ధోని తొలి మ్యాచ్‌లోనే డకౌటయ్యాడు. కానీ.. ఆ తర్వాత పాకిస్థాన్‌పై మెరుపు శతకంతో వెలుగులోకి వచ్చిన ఈ పవర్ హిట్టర్.. ఏ దశలోనూ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. క్రికెట్ ప్రపంచంలోనే ధోనీ తరహాలో మ్యాచ్‌ని ఆఖరి ఓవర్లలో ఎవరూ ఫినిష్ చేయలేదు.. చేయలేరని క్రికెట్ దిగ్గజాలు సైతం అంగీకరించిన వాస్తవం. అంతలా మ్యాచ్‌ల్ని ముగించడంలో ధోనీ తన మార్క్ చూపించాడు.

కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2007లో భారత్‌కి టీ20 ప్రపంచకప్ అందించిన ధోని.. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ 2011లో వన్డే ప్రపంచకప్‌ని టీమిండియా గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్‌ని విజేతగా నిలిపి.. క్రికెట్ ప్రపంచంలోనే మూడు ఐసీసీ టోర్నమెంట్‌లు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా రికార్డుల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాడు.

వికెట్ కీపర్‌గా ధోనీకి కెరీర్ ఆరంభం నుంచి తిరుగులేదు. క్షణాల వ్యవధిలో బెయిల్స్‌ను గీరాటేసే ధోనీ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కదలికలకి అనుగుణంగా బౌలర్లకి సూచనలు ఇవ్వగల జ్ఞాని. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. ఇప్పటికే మైదానంలో ధోనీనే అనధికార కెప్టెన్. బౌండరీ లైన్ దగ్గర కోహ్లీ ఫీల్డింగ్ చేస్తుంటే..? ఫీల్డింగ్ కూర్పులు, బౌలింగ్‌ మార్పుల్ని ధోనీనే స్వయంగా పర్యవేక్షింస్తుంటాడు. అందుకే టీమ్‌లో ధోనీ ఉండటం కోహ్లీకి అదనపు బలమని మాజీ క్రికెటర్లు తరచూ చెప్తుంటారు.

క్రికెట్‌లో ఇన్ని ఘనతలు సాధించినా.. ధోనీకీ విమర్శల బాధ తప్పలేదు. గత ఏడాది పేలవ ప్రదర్శన కారణంగా కనీసం ప్రపంచకప్ జట్టులో కూడా చోటు దక్కదంటూ కొంత మంది మాజీ క్రికెటర్లు వెటకారంగా మాట్లాడారు. కానీ.. విమర్శలకి నోటితో కాకుండా బ్యాట్‌తో బదులివ్వడం ధోనీకి అలవాటే. 2019లో ఆస్ట్రేలియాపై వన్డేల్లో హ్యాట్రిక్ అర్ధశతకాలతో మళ్లీ ఫామ్ అందుకున్న ధోనీ.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. ప్రపంచకప్‌లో మునుపటిలా అతను దూకుడుగా ఆడలేకపోయినా.. ఇప్పటికీ జట్టులో ధోనీని మించిన ఫినిషర్ లేరు.

సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 90 టెస్టులాడిన ధోని.. 349 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. 300పైచిలుకు వన్డేలాడినా.. ఇప్పటికీ అతని సగటు 50.58గా నిలకడకి నిదర్శనం. మొత్తంగా.. టీమ్‌కి తాను అవసరం లేదు అనుకుంటే.. రిటైర్మెంట్ ప్రకటించడానికి క్షణం కూడా ధోనీ ఆలోచించడని ఇటీవల ఓ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. నిజమే.. టెస్టులకి రిటైర్మెంట్.. వన్డే, టీ20ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం తదితర నిర్ణయాలు ఈకోవకే చెందుతాయి.

 

 

 

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   40 minutes ago


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   4 hours ago


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   8 hours ago


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   20 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14-04-2021


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14-04-2021


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle