newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

యూఏఈలోనే మహిళల ఐపీఎల్

03-08-202003-08-2020 11:40:38 IST
2020-08-03T06:10:38.917Z03-08-2020 2020-08-03T06:10:22.092Z - - 10-04-2021

యూఏఈలోనే మహిళల ఐపీఎల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. చాలెంజర్‌ సిరీస్‌ పేరిట జరిగే ఈ టోర్నీని నవంబరు 1 నుంచి 10 వరకు యూఏఈలోనే నిర్వహించనున్నట్టు బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపారు. 

దీంతో ఈసారి మహిళల ఐపీఎల్‌ ఉండదేమోనన్న సందేహాలకు ఫుల్‌స్టాప్‌ పడింది. కరోనా కష్ట కాలంలో ఈ ఏడాది లీగ్‌ జరుగుతుందా లేదా అనే అనుమానాలను బీసీసీఐ పటాపంచలు చేసింది.మహిళల టోర్నీలో గతేడాదిలాగే మూడు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టోర్నీ కన్నా ముందే సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఉన్న మహిళా క్రికెటర్లకు శిక్షణ శిబిరం కూడా ఏర్పాటు చేయనున్నారు. 

ఈ షెడ్యూల్‌ మధ్యలో చాలెంజర్‌ సిరీస్ను జరుపుతాం. అలాగే కరోనా వైరస్ కారణంగా జాతీయ క్రికెట్‌ శిబిరం మూతబడింది కాబట్టి మహిళల ఐపీఎల్‌ కన్నా ముందే వారికి శిబిరం ఏర్పాటు చేస్తాం' అని సౌరవ్ గంగూలీ చెప్పారు. యూఏఈలో మహిళల ఐపీఎల్‌నూ నిర్వహించాలన్న బీసీసీఐ నిర్ణయం పట్ల భారత మహిళల వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ సంతోషం వ్యక్తం చేసారు.

వన్డే ప్రపంచకప్‌ కోసం మా సన్నాహం ఎట్టకేలకు ఆరంభం కానుంది.బీసీసీఐ, సౌరవ్ గంగూలీ, జై షాలకు కృతజ్ఞతలు' అని ట్విట్ చేశారు.  సీనియర్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ కూడా బీసీసీఐ బాస్ గంగూలీ, బీసీసీఐలకు కృతజ్ఞతలు తెలిపారు. యూఏఈలో మహిళల ఐపీఎల్‌ నిర్వహించాలన్న బీసీసీఐ నిర్ణయాన్ని జులన్‌ గోస్వామి కూడా స్వాగతించారు.

భారత మహిళల జట్టు మార్చిలో టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ తర్వాత ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. వన్డేలు మాత్రమే ఆడే మిథాలీ రాజ్ చివరిసారి నవంబరులో మ్యాచ్‌ ఆడారు. మహిళల వన్డే ప్రపంచకప్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో న్యూజిలాండ్‌లో జరగాల్సి ఉంది.మహిళల ఐపీఎల్‌ షెడ్యూల్‌పై విదేశీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్టోబరు 17 నుంచి నవంబరు 29 వరకు బిగ్‌బాష్‌ లీగ్‌ జరుగుతుంది. ఇదే సమయంలో ఐపీఎల్‌ జరగనుంది. దీంతో అలీసా హీలీ (ఆస్ట్రేలియా), సుజీ బేట్స్‌ (న్యూజిలాండ్‌) లాంటి విదేశీ మహిళా స్టార్లు ఐపీఎల్‌కు దూరమయ్యే పరిస్థితులున్నాయి. 

మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న భారత క్రికెటర్లు ఇప్పుడేం చేస్తారు?. వారికి గుడ్‌లక్‌' అని హీలీ ట్వీట్‌ చేయగా.. 'డబ్ల్యుబీబీఎల్‌, మహిళల ఐపీఎల్‌ ఒకేసారి జరగడం సిగ్గుచేటు అని సుజీ ట్వీట్‌ చేసారు.      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle