newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

యూఏఇ నుంచి రైనా రిటర్న్.. ఐపీఎల్ నుంచి ఇంటికి..

29-08-202029-08-2020 12:52:22 IST
Updated On 29-08-2020 13:25:50 ISTUpdated On 29-08-20202020-08-29T07:22:22.647Z29-08-2020 2020-08-29T07:20:48.785Z - 2020-08-29T07:55:50.586Z - 29-08-2020

యూఏఇ నుంచి రైనా రిటర్న్.. ఐపీఎల్ నుంచి ఇంటికి..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ 2020 నుంచి సురేష్ రైనా తప్పుకున్నాడు. ఐపీఎల్ టోర్నమెంట్ కోసం కొద్దిరోజుల క్రితమే రైనా అబుదాబి వెళ్లాడు. అయితే అక్కడ టీం మెంబర్స్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ షాక్ తగిలింది. CSK స్టార్ ప్లేయర్ సురేష్ రైనా టోర్నీ నుంచి తప్పుకోవడంతో అభిమానులు హతాశులయ్యారు. వ్యక్తిగత కారణాలతో రైనా స్వదేశానికి తిరిగి వెళ్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ట్వీట్ చేసింది. 

ఇప్పటికే చెన్నై బృందంలో 12 మందికి కరోనా సోకడంతో ఆజట్టులో కలకలం రేగింది. తాజాగా రైనా తప్పుకోవడంతో ఆ ప్రభావం జట్టుపై తీవ్రంగా పడుతుందని భావిస్తున్నారు. రైనా వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడని, ఐపీఎల్‌ 2020 సీజన్‌కు అందుబాటులో ఉండడని టీమ్‌ సీఈవో కేఎస్‌ విశ్వనాథన్‌ ధ్రువీకరించారు.

కాగా ఐపిఎల్ వచ్చే నెల నుంచి జరుగుతుంది. ఈ టోర్నీ కోసం గానూ ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్ చేరుకున్నాయి. నిన్న చెన్నై ఫాస్ట్ బౌలర్ ఒకరికి కరోనా వచ్చినట్టు నిర్ధారించారు. దీంతో మిగతా టీమ్స్ కూడా అప్రమత్తమయ్యాయి.  కరోనా విషయంలో జాగ్రత్తగా వుండాలని బీసీసీఐ సూచించింది. 

ధోనీసేన ఈ నెల 21న దుబాయ్‌లో అడుగుపెట్టింది.దుబాయి నిబంధనల ప్రకారం.. ఆటగాళ్లకు 1,3, 6 రోజులూ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మూడు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల్లో సీఎస్‌కే ఆటగాడికి, 12 మంది సిబ్బందికి కరోనా కరోనా సోకిందని దుబాయ్‌ వర్గాలు తెలిపాయి. వైరస్ సోకిన అందరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందాని డాక్టర్స్ పేర్కొన్నారు. ఆటగాడు, సిబ్బందికి వైరస్‌ సోకడంతో సీఎస్కే బృందం సెప్టెంబర్‌ ఒకటి వరకు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. కరోనా బాధితులు మాత్రం అదనంగా మరో ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. 

యూఏఇ వెళ్లినా వదలని కరోనా....12 మంది ప్లేయర్ల పరేషాన్

బ్రేకింగ్: ధోనీ టీం మెంబర్స్‌కి కరోనా.... ఐపీఎల్‌పై అనుమానాలు


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle