యువరాజ్ అభిమానులకు పండగే..
10-09-202010-09-2020 12:36:29 IST
2020-09-10T07:06:29.975Z10-09-2020 2020-09-10T07:06:27.283Z - - 20-04-2021

టీమ్ఇండియా రెండు ప్రపంచకప్‌లు(2007 టీ20, 2011 వన్డే వరల్డ్‌కప్) సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. అటు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ మెరుపులు మెరిపించాడు. ఆ తరువాత క్యాన్సర్ బారిన పడి కోలుకున్నప్పటికి మునపటిలా ఆడలేకపోవడంతో గతేడాది జూన్‌లో అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం విదేశీ లీగుల్లో సత్తా చాటుతున్నాడు యువీ. తాజాగా.. యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్ విషయంలో యూటర్న్ తీసుకున్నాడు. గతంలో తాను ప్రకటించిన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవడానికి యువరాజ్ బీసీసీఐకి లేఖ కూడా రాశాడు. తన పునరాగమనానికి అనుమతి ఇవ్వాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షాకు ఈమెయిల్ పంపించాడని సంబంధిత వర్గాలు అంటున్నాయి. పంజాబ్ క్రికెట్ ప్రయోజనాల కోసం రిటైర్మెంట్ను వీడాలని పంజాబ్ క్రికెట్ సంఘం కార్యదర్శి పునీత్ బాలి కోరిన నేపథ్యంలో యువీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 'రిటైర్మెంట్కు స్వప్తి పలకడంపై మొదట తటపటాయించా.. బీసీసీఐ అనుమతిస్తే ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగుల్లో ఆడాలనుకున్నప్పటికీ.. దేశవాలీకి మాత్రం దూరమయ్యా. కానీ బాలి విజ్ఞప్తిని విస్మరించలేకపోయా. మూడు నాలుగు వారాలు ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నా' అని యువరాజ్ అన్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్ కార్యకలాపాన్ని నిలిచిపోయిన సంగతి తెలిసిందే. పీసీఏ(పంజాబ్ క్రికెట్ సంఘం) విజ్ఞప్తి మేరకు యువరాజ్ మొహాలీ స్టేడియంలో యువ ఆటగాళ్లకు రెండు సుధీర్ఘ శిబిరాలు నిర్వహించాడు. క్రికెట్లో ఒత్తిడిని ఎలా జయించాలో, మ్యాచ్‌లకు ఎలా సన్నద్దం కావాలో యువ ఆటగాళ్లకు నేర్పించాడు. యువీ ఆధ్వర్యంలో శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, అన్మోల్ప్రీత్ సింగ్ వంటి యువ ఆటగాళ్లు సాధన చేశారు. ఈ సమయంలోనే యువీ మనసు ఆటపై మళ్లింది. 'పంజాబ్‌కు ఛాంపియన్‌షిప్‌లు అందించాలని కోరిక కలిగింది. హర్భజన్ సింగ్, నేనూ వేర్వేరుగా ఎన్నో గెలిచాం. కానీ ఇద్దరం కలిసి పంజాబ్‌కు ఏం చేయలేదు. అదే నన్ను ఈ నిర్ణయం తీసుకొనేలా చేసింది. బీసీసీఐ నుండి అనుమతి వస్తే కేవలం టీ20లు ఆడతాను. ఏం జరుగుతుందో చూడాలి' అని యువరాజ్ అన్నాడు. ఒకవేళ బీసీసీఐ నుంచి యువరాజ్ సింగ్‌కి అనుమతి లభిస్తే మళ్లీ విదేశీ లీగ్‌ల్లో పాల్గొనేందుకు అతనికి అవకాశం ఉండదు.

CSK vs RR : చెన్నై తో తలబడనున్న రాజస్థాన్.. గెలుపెవరిది?
14 hours ago

భారీ లక్ష్యమైనా.. చితక్కొట్టిన ఢిల్లీ
a day ago

IPL 2021: వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగుళూర్
18-04-2021

సన్ రైజర్స్.. మరో 'సారీ'..!
18-04-2021

MI vs SRH: కొండను ఢీకొట్టబోతున్న సన్ రైజర్స్
17-04-2021

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?
16-04-2021

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్
15-04-2021

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే
15-04-2021

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
15-04-2021

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
15-04-2021
ఇంకా