newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

మ‌ల‌న్ సెంచరీ... ఇంగ్లాండ్ ఘన విజయం

08-11-201908-11-2019 18:13:24 IST
2019-11-08T12:43:24.812Z08-11-2019 2019-11-08T12:42:57.460Z - - 27-05-2020

మ‌ల‌న్ సెంచరీ... ఇంగ్లాండ్ ఘన విజయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నేపియ‌ర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్ లో ఇరు జట్లు 2-2 తో సమానంగా ఉన్నాయి. మొదటి టీ20లో ఇంగ్లాండ్ గెలుపొందగా, రెండు, మూడో టీ20ల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇక చివదైన ఐదో టీ20 ఆక్లాండ్ వేదికగా ఆదివారం జరగనుంది. 

టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ ఇంగ్లాండ్ కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 16 పరుగుల వద్ద జానీ బెయిర్ స్టో (8; 9 బంతుల్లో 1 పోర్)  శాంటర్న్ బౌలింగ్ లో డారిల్ మిచెల్ కు క్యాచ్ ఇచ్చిఅవుటైయ్యాడు. మరో ఓపెనర్ టామ్ బాంటన్(31;20బంతుల్లో 4పోర్లు, 1సిక్సర్) తో జత కలిసిన వన్ డౌన్ బ్యాట్స్ మెన్ డీజే మ‌ల‌న్ 103( 51 బంతుల్లో; 9ఫోర్లు, 6 సిక్స్‌) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఇంగ్లాండ్ పవర్ ప్లే (6ఓవర్లు) ముగిసే సరికి వికెట్ నష్టానికి 48 పరుగులు సాధించింది. తరువాతి ఓవర్ లో టామ్ బాంటన్ ఔటైనా న్యూజిలాండ్ కు ఆ సంతోషం ఎక్కువ సేపు మిగల లేదు. 

మలన్ కు జత కలిసిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 91( 41 బంతుల్లో; 7 ఫోర్స్, 7 సిక్స్‌) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడడంతో స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. వీళ్లిద్దరూ మూడో వికెట్ కు రికార్డు స్థాయిలో 182 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో మలన్ 30బంతుల్లో అర్థశతకం సాధించగా మోర్గాన్ కేవలం 21 బంతుల్లోనే ఆ ఘనత అందుకున్నాడు.

ఇక ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన ఇష్ సోధి కి మలాన్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్ లో 4,6,6,4,6,2 బాది మొత్తంగా 28 పరుగులు సాధించాడు. ఆ తరువాతి ఓవర్లో చివరి బంతికి సిక్స్ బాదిన మలాన్ టీ20లో తన మొదటి శతకాన్ని అందుకున్నాడు. చివరి ఓవర్ లో భారీ షాట్లకు యత్నించిన మోర్గాన్ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరి వీరవిహారంతో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 241 పరుగులు సాధించింది. ఇదే టీ20ల్లో ఇంగ్లాండ్ అత్యుత్తమ స్కోర్. 

అనంతరం 242 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కు ఓపెనర్లు గ‌ప్తిల్ (27 ; 14 బంతుల్లో 1 పోర్, 3 సిక్స్‌లు), మున్రో 30( 21 బంతుల్లో; 3 ఫోర్లు) లు శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు మొదటి వికెట్ కు కేవలం 4.3 ఓవరల్లోనే 53 పరుగులు జోడించారు. అయితే వీరి తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్లు విఫల మవడంతో ఏ దశలోనూ న్యూజిలాండ్ విజయం దిశగా సాగలేదు.

కాగా చివరల్లో ఆ జట్టు కెప్టెన్ టిమ్ సౌతీ (39 ; 15 బంతుల్లో 2పోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించిన్పప్పటికి ఓటమి అంతరం తగ్గించాడే తప్ప జట్టును విజయతీరాలకు తీసుకెళ్ల లేకపోయాడు. న్యూజిలాండ్ 16.5 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు 76 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించింది. ఇరు జట్ల మధ్య చివరి టీ20 ఆదివారం ఆక్లాండ్ వేదికగా జరగనుంది. 

హాకీ మాంత్రికుడు, ధ్యాన్‌చంద్‌తో సమానుడు బల్బీర్ సింగ్ ఇకలేరు

హాకీ మాంత్రికుడు, ధ్యాన్‌చంద్‌తో సమానుడు బల్బీర్ సింగ్ ఇకలేరు

   14 hours ago


మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్.. మాయ చేస్తున్న డేవిడ్ వార్నర్

మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్.. మాయ చేస్తున్న డేవిడ్ వార్నర్

   20 hours ago


బంతిపై ఉమ్మి వేయడంపై నిషేధం తాత్కాలికమే.. ఐసీసీ చీఫ్ అనిల్ కుంబ్లే వివరణ

బంతిపై ఉమ్మి వేయడంపై నిషేధం తాత్కాలికమే.. ఐసీసీ చీఫ్ అనిల్ కుంబ్లే వివరణ

   25-05-2020


కోహ్లీని జట్టులోంచి తీసేశారు.. ఇందుకా..!

కోహ్లీని జట్టులోంచి తీసేశారు.. ఇందుకా..!

   24-05-2020


వికెట్ కీపర్‌కు మారుపేరు ఇప్పటికీ ధోనీనే.. పక్కనపెడితే తీవ్ర నష్టం.. కైఫ్ ప్రశంసల వర్షం

వికెట్ కీపర్‌కు మారుపేరు ఇప్పటికీ ధోనీనే.. పక్కనపెడితే తీవ్ర నష్టం.. కైఫ్ ప్రశంసల వర్షం

   23-05-2020


ఐపీఎల్ పై ఆశలు.. బీసీసీఐ నిర్ణయం ఎలా వుంటుందో?

ఐపీఎల్ పై ఆశలు.. బీసీసీఐ నిర్ణయం ఎలా వుంటుందో?

   20-05-2020


వన్డేల్లో సచిన్ డబుల్ సెంచరీకి అంపైర్ భయమే కారణం..డేల్ స్టెయిన్ ఆరోపణ

వన్డేల్లో సచిన్ డబుల్ సెంచరీకి అంపైర్ భయమే కారణం..డేల్ స్టెయిన్ ఆరోపణ

   18-05-2020


సోషల్ మీడియాను ఊపేస్తున్న డేవిడ్ వార్నర్

సోషల్ మీడియాను ఊపేస్తున్న డేవిడ్ వార్నర్

   18-05-2020


కోహ్లీ బౌలింగ్.. అనుష్క బ్యాటింగ్ అదుర్స్

కోహ్లీ బౌలింగ్.. అనుష్క బ్యాటింగ్ అదుర్స్

   18-05-2020


కోవిడ్ 19 ఎఫెక్ట్... బంతికి మెరుపులు ఎలా?ఎంఎస్కే ఏమన్నారంటే?

కోవిడ్ 19 ఎఫెక్ట్... బంతికి మెరుపులు ఎలా?ఎంఎస్కే ఏమన్నారంటే?

   17-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle