newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మ్యాచ్ విన్నర్లు కోహ్లీ, డివిలియర్స్ కాదు.. గవాస్కర్

19-09-202019-09-2020 07:44:06 IST
2020-09-19T02:14:06.896Z19-09-2020 2020-09-19T02:14:03.980Z - - 12-04-2021

మ్యాచ్ విన్నర్లు కోహ్లీ, డివిలియర్స్ కాదు.. గవాస్కర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ 2020లో మైదానంలో తొలి బంతి పడక ముందే ఐపీఎల్ జట్ల బలాబలాలు, లోపాల గురించి వరుస కామెంట్లు చేస్తున్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సమతూకంపై వ్యాఖ్యలు చేశాడు. అంతకు ముందు అంటే గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఈసారి టైటిల్ గెలవడం కష్టమే అంటూ వ్యాఖ్యానించిన గవాస్కర్ శుక్రవారం ఆర్సీబీ జట్టులో ఫేవరైట్లు అందరూ అనుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ, డివీలియర్స్ ఏమాత్రం కాదంటూ బాంబు పేల్చాడు. 

కాగితంపై రాతలు చూస్తే చాలా బలంగా కనిపించే ఆర్‌సీబీ జట్టు ఇంతవరకు ఐపీఎల్‌ టైటిల్‌ గెలవకపోవడం ఒక మిస్టరీగా మారిందని గవాస్కర్ పేర్కొన్నాడు.. గొప్ప ఆటగాళ్లైన విరాట్‌ కోహ్లి, డివిలియర్స్‌ లాంటి వారు ఉన్నా ఆర్సీబీ జట్టు కీలకదశలో ఒత్తిడికి లోనవుతూ వస్తోందని, వీరిద్దరు విఫలమైతే.. ఇక ఆర్‌సీబీ జట్టులో మిగతా ఆటగాళ్లు ఆడలేరన్నంతగా ముందుగానే చేతులెత్తేస్తోందని గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

ఈసారి టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న ఆర్‌సీబీకి కొత్త కోచ్‌ తన సలహాలతో జట్టు తలరాత మారుస్తాడేమో చూడాలి అని గవాస్కర్ పేర్కొన్నాడు. దీంతో పాటు ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆర్‌సీబీ జట్టు తరపున మ్యాచ్‌ విన్నర్‌ ఎవరో కూడా గవాస్కర్ చెప్పేశాడు. 'ఈ ఐపీఎల్‌లో కోహ్లి, డివిలియర్స్‌లే ఫేవరెట్ అని అంతా భావిస్తున్నారనీ, కానీ నిజానికి ఈసారి లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ మ్యాచ్‌ విన్నర్‌ కానున్నాడని గవాస్కర్ విశ్లేషించాడు.  యూఏఈ పిచ్‌లు స్లోగా ఉండడంతో స్పిన్‌ బౌలర్లు కీలకంగా మారనున్నారనీ, అందుకే చహల్‌ మ్యాచ్‌ విన్నర్‌ కానున్నాడని గవాస్కర్ చెప్పాడు. 

విరాట్‌ కోహ్లి.. ఏబీ డివిలియర్స్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లు  ఉన్నా గత 12 సీజన్లుగా ఆర్‌సీబీ జట్టు ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో మాత్రం తడబడుతూనే ఉంది.  ఎన్ని మార్పులు చేసినా ఆ జట్టు తలరాత మాత్రం మారడం లేదు. ఈసారి వేలంలో బిగ్‌ హిట్టర్‌ ఆరోన్‌ ఫించ్‌, ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌లను దక్కించుకొని మరింత బలంగా తయారైంది. ఈసారి మాత్రం టైటిల్‌ను ఎలాగైనా దక్కించుకోవాలనే కసితో బరిలోకి దిగుతున్న ఆర్‌సీబీ ఏం చేస్తుందో చూడాలి. కాగా ఆర్‌సీబీ జట్టు సెప్టెంబర్‌ 21న తమ మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది.

దాదాపు 5 నెలల విరామం తర్వాత సొంత గడ్డ మీద కాకుండా ఐపీఎల్ 2020 పోటీలు దుబాయ్ కేంద్రంగా ఈరోజు నుంచి (సెప్టెంబర్19) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle