newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోదీ ఉన్నంతవరకు భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లుండవ్: ఆఫ్రిది

25-02-202025-02-2020 14:40:39 IST
2020-02-25T09:10:39.985Z25-02-2020 2020-02-25T09:10:31.462Z - - 11-04-2021

మోదీ ఉన్నంతవరకు భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లుండవ్: ఆఫ్రిది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్-పాకిస్తాన్ దేశాలమధ్య క్రికెట్‌తో సహా అన్ని రకాల సంబంధాలు దెబ్బతినడానికి ప్రధాన కారకుడు భారత ప్రధాని నరేంద్రమోదీయేనని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది విమర్శించాడు. మోదీ అధికారంలో ఉన్నంతవరకు ఇరు దేశాల మధ్య క్రికెట్ పునరుద్థరణకు సంబంధించి భారత్ నుంచి ఏరకమైన స్పందనా ఉండదని అఫ్రీది వ్యాఖ్యానించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

భారతీయులతో సహా మాకందరికీ మోదీ ఎలా ఆలోచిస్తాడని అర్థమైంది. మోదీ ఆలోచన పూర్తిగా ప్రతికూల ధోరణి వైపు సాగుతోంది అని అప్రీదీ చెప్పాడు. ఇరుదేశాల ప్రజలు తమ మధ్య రాకపోకలు ఉండాలని, ఇరుదేశాల్లో పర్యటించాలని కోరుకుంటున్నారు. కానీ మోదీ అజండా ఏమిటో, ఆయన ఏం కోరుకుంటున్నారు అనేది నాకు అంతుబట్టడం లేదని విమర్శించాడు.

'భారత్‌, పాక్‌ల మధ్య మంచి సంబంధాలు లేకపోవడానికి ఒకే ఒక వ్యక్తి కారణం. ఆయనే భారతదేశ ప్రధాని మోదీ. ఆయన అధికారంలో ఉన్నంత వరకు భారత్‌ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాదు.  అసలు మోదీ ఎజెంటా ఏమిటో, ఆయన ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. సరిహద్దులకు రెండు వైపులా ఉన్న ప్రజలు ఒకరి దేశంలోకి ఒకరు ప్రయాణించాలని చూస్తున్నారు. కానీ మోదీ ఆలోచనలు మాత్రం తిరోగమనాన్ని  సూచిస్తున్నాయి' అంటూ తెలిపాడు. 

కాగా భారత జట్టు చివరిసారిగా రాహుల్‌ ద్రవిడ్‌ నాయకత్వంలో 2006లో పాక్‌లో పర్యటించింది. అయితే 2008లో 26-11 ముంబై దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో అప్పటినుంచి టీమిండియా పాక్‌ గడ్డపై అడుగు పెట్టలేదు. 

ఐసీసీ వేదికగా జరిగిన టోర్నమెంట్లలో తప్ప భారత్‌- పాక్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగలేదు. చివరిసారి 2008లో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ జరిగితే.. 2013 నుంచి ఇరు దేశాల మధ్య క్రికెట్‌ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి..

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle