newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మొన్న రోహిత్.. నిన్న ధోని.. ఇప్పుడు కోహ్లీ షాట్లు చూశారా..?

12-09-202012-09-2020 14:33:48 IST
2020-09-12T09:03:48.054Z12-09-2020 2020-09-12T09:03:45.054Z - - 15-05-2021

మొన్న రోహిత్.. నిన్న ధోని.. ఇప్పుడు కోహ్లీ షాట్లు చూశారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ టైటిల్ ను అందుకోలేకపోయిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఒకటి. ఈ ఏడాది మాత్రం టైటిల్ ను అందుకోవాలని బలంగా ఫిక్స్ అయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రాక్టీస్ ను షురూ చేసింది.

తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రైనింగ్ సెషన్ కు సంబంధించిన వీడియోను పెట్టింది. అందులో విరాట్ కోహ్లీ భయంకరమైన ఫామ్ లో ఉండి షాట్స్ ఆడుతుండడాన్ని గమనించవచ్చు. నెట్ సెషన్స్ లో క్లీన్ హిట్టింగ్ తో 31 సంవత్సరాల  విరాట్ చెలరేగిపోయాడు. ఓ భారీ షాట్ కొట్టిన తర్వాత విరాట్ కోహ్లీ చేతులు పైకెత్తి గాల్లోకి చూపించాడు. గతంలో కంటే పరుగులు సాధించడానికి మరింత కసిగా కోహ్లీ ఉన్నాడని అర్థం అవుతోంది.

ఈ వీడియోలో విరాట్ కోహ్లీ తమ జట్టు ప్రాక్టీస్ సెషన్ ను వివరించాడు. అన్ని నెలల గ్యాప్ వచ్చిన తర్వాత కూడా ఆటగాళ్లు మంచి టచ్ లో ఉన్నారని తనకు అనిపిస్తోందని కోహ్లీ అన్నాడు. ఆటగాళ్లు ప్రస్తుత పరిస్థితులకు అలవాటు పడడానికి సమయం తీసుకుందని అన్నాడు. ఆటగాళ్లు మంచి మంచి షాట్స్ ఆడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని.. వికెట్ పేస్ ను అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నామని చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్తుతం అన్ని విభాగాల్లో బాగుంది అని చెప్పుకొచ్చాడు. ఫిట్నెస్ పరంగా కూడా ఆటగాళ్లు అద్భుతంగా ఉన్నారని తెలిపాడు.  

కొన్ని నెలల గ్యాప్ రావడం పట్ల ఆటగాళ్లు కూడా మొద్దుబారి ఉంటారని.. కానీ ప్రాక్టీస్ సెషన్ల ద్వారా గాడిలో పెట్టారని కోహ్లీ వెల్లడించాడు. ఆటగాళ్ల ఇంటెన్సిటీ లెవెల్స్ చాలా ముఖ్యమని.. అదే పనిలో కోచింగ్ బృందం కూడా ఉందని తెలిపాడు. ఎంతో బ్యాలెన్స్ గా టీమ్ ను రూపొందించాల్సి ఉంటుందని అన్నాడు. ప్రాక్టీస్ సెషన్లు మాత్రం చాలా బాగా సాగుతూ ఉన్నాయని ఆనందాన్ని వెల్లడించాడు కోహ్లీ. మైండ్ సెట్ ను కూడా మార్చుకుని టోర్నమెంట్ లో ముందుకు సాగాలని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 

ధోని కొట్టిన భారీ సిక్సర్ కు షాక్ తిన్న మురళీ విజయ్..!

ఐపీఎల్: హిట్‌మ్యాన్ కొడితే బాక్స్ బద్దలైంది..

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle