newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మొదటి మ్యాచ్ కే అందుబాటులోకి రానున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లు

18-09-202018-09-2020 17:16:56 IST
Updated On 18-09-2020 17:16:54 ISTUpdated On 18-09-20202020-09-18T11:46:56.706Z18-09-2020 2020-09-18T11:45:14.724Z - 2020-09-18T11:46:54.185Z - 18-09-2020

మొదటి మ్యాచ్ కే అందుబాటులోకి రానున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ 2020 కోసం ఇప్పటికే ఎన్నో పటిష్టమైన చర్యలు చేపట్టారు అధికారులు. కరోనా భయం నీడన ఐపీఎల్ జరుగుతోంది. ఆటగాళ్లెవరైనా చిన్న తప్పు చేసినా కూడా టోర్నీ మొత్తానికి చెడ్డ పేరు రానుంది. అందుకే బయో బబుల్ లో ఎన్నో జాగ్రత్తల మధ్యన ఐపీఎల్ ను నిర్వహిస్తూ ఉన్నారు. ఆటగాళ్లు, సిబ్బంది క్వారెంటైన్ పూర్తీ చేసుకున్న తర్వాతనే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆరు రోజుల పాటూ క్వారెంటైన్ లో ఉండి ప్రాక్టీస్ ను షురూ చేశాయి ఫ్రాంచైజీలు..! పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లను, సిబ్బందిని పక్కన పెట్టాయి. నెగటివ్ వచ్చాకనే ప్రాక్టీస్ సెషన్స్ లోకి అడుగుపెట్టారు. ఇటీవలే ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లు సిరీస్ ను ముగించాయి. వీరికి క్వారెంటైన్ నిబంధనలు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా..  ఒకటిన్నర రోజు పాటు వారు ఎవరితోనూ కలవకుండా ఉండి, కరోనా టెస్ట్ చేయించుకుని నెగటివ్ వస్తే సరిపోతుందని అధికారులు వెల్లడించారు.

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా సిరీస్ కూడా బయో బబుల్ లోనే సాగింది.  తామంతా బయో బబుల్ లో ఉన్నామని, తమ క్వారంటైన్ సమయాన్ని తగ్గించాలని కోరడంతో నిర్వాహకులు ఆటగాళ్ల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారంలో దుబాయ్ చేరుకున్న సౌరవ్ గంగూలీ, అక్కడి ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన తరువాత ఈ నిర్ణయం వచ్చింది.  కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న పాట్ కమిన్స్, మోర్గాన్, బాంటన్ లు బయో బబుల్ లో లేనందున ఆరు రోజుల క్వారంటైన్ లో ఉన్నారు.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ నుంచి మొత్తం 21 మంది దుబాయ్ కి చేరుకున్నారు. వీరందరూ ఆయా జట్లలో చాలా కీలమైన ఆటగాళ్లు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్ల విషయంలో ఈ నిర్ణయం పట్ల ఫ్రాంచైజీలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కేవలం 36 గంటలు మాత్రమే క్వారెంటైన్ అంటే ఆటగాళ్లు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. టోర్నమెంట్ సజావుగా సాగాలని అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తీ చేస్తున్నారు. ఇక ఆటగాళ్లు తన బ్యాటింగ్, బౌలింగ్ తో అలరించడమే తరువాయి.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle