newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మురిసిపోయిన అనుష్క.. కోహ్లీ ఏమన్నాడంటే..!

14-09-202014-09-2020 07:23:05 IST
2020-09-14T01:53:05.873Z14-09-2020 2020-09-14T01:53:02.975Z - - 20-04-2021

మురిసిపోయిన అనుష్క.. కోహ్లీ ఏమన్నాడంటే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాలీవుడ్ నటి అనుష్క శర్మ- టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ ఎంతో హాయిగా వారి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ తాము ముగ్గురం కాబోతున్నామంటూ గత నెలలో ప్రకటించారు. వారిద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటోలో అనుష్క శర్మ బేబీ బంప్ తో ఉండడాన్ని అందరూ గమనించవచ్చు.

2021 జనవరికి బిడ్డ రాబోతోందని తెలిపారు. దీంతో అటు బాలీవుడ్ లోనూ, ఇటు క్రికెట్ వర్గాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. ఐపీఎల్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లిన విరాట్ కోహ్లీకి అందరూ కంగ్రాట్స్ చెప్పి.. ఆ తర్వాత ఏదైనా విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారట.

తాజాగా అనుష్క శర్మ ఓ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది. అందులో ఆమె ఓ బీచ్ లో ఉండగా.. తన గర్భాన్ని చూస్తూ మురిసిపోయింది. ''ఒక జీవి నీలో ప్రాణం పోసుకునే సందర్భాన్ని ఆస్వాదించడాని కంటే నిజమైనది.. మధురమైనది మరేదీ లేదు. ఇది మీ నియంత్రణలో లేనప్పుడు నిజంగా ఇది ఏమిటి?" అంటూ ఫోటోను అప్లోడ్ చేసింది. ఈ ఫోటోకు పలువురు లైక్స్, కామెంట్లు పెడుతూ వచ్చారు.

విరాట్ కోహ్లీ కూడా కామెంట్లు చేసిన వారిలో ఉన్నాడు. "నా జీవితం అంతా ఒక్క ఫ్రేములో ఉంది" అని కామెంట్ చేశాడు కోహ్లీ. ఎంత మంది కామెంట్లు చేసినా కోహ్లీ చేసిన కామెంట్ విన్నర్ గా నిలిచింది. మైదానంలో కూడా ఏదీ దాచుకోకుండా బయటకు చెప్పేసే విరాట్.. తన భార్య గర్భంతో ఉన్న ఫోటోను చూసి తన జీవితం అంటూ మనసులో మాటను చెప్పేశాడు.  

అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ లు 2017లో పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో వీరి పెళ్లి అత్యంత ప్రైవేట్ గా జరిగింది. ప్రస్తుతం అనుష్క శర్మ నిర్మాతగా పలు ప్రాజెక్టుల బాధ్యత తీసుకుంది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle