newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

ముంబైపై రాజస్థాన్ విజయం

14-04-201914-04-2019 08:11:42 IST
2019-04-14T02:41:42.180Z14-04-2019 2019-04-14T02:41:35.241Z - - 22-07-2019

ముంబైపై రాజస్థాన్ విజయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్ష్యాన్ని 19.3 ఓవర్లో సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్స్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. రహానే, బట్లర్‌లు కలిసి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 60 పరుగుల వద్ద కృనాల్ పాండ్యా బౌలింగ్ లో రహానే(37) సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 

ఈ క్రమంలో బట్లర్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. బట్లర్-సంజు శాంసన్ ఇద్దరూ ధాటిగా ఆడటంతో రాజస్థాన్ 10 ఓవర్లోనే 100 పరుగుల మార్క్ దాటింది. 13 ఓవర్ వేసిన అలజరి.జోసెఫ్ కు బట్లర్ చుక్కలు చూపాడు. ఆ ఓవర్ లో బట్లర్ 28 పరుగులు బాదాడు. ఆ ఓవర్ లో వరుసగా 6,4,4,4,4,6 పరుగులు వచ్చాయి. అదే ఊపులో రాహుల్ చాహర్ బౌలింగ్‌లో బారి షాట్ ఆడబోయిన బట్లర్(89) ఔట్ అయ్యాడు. 

బట్లర్ 43 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేశాడు. ఆ తరువాత రాజస్థాన్ వెంట వెంటనే వరుసగా వికెట్స్ కోల్పోయింది. సంజు శాంసన్(31), రాహుల్ త్రిపాఠీ(1), లివింగ్ స్టోన్(1) వెంట వెంటనే ఔట్ అయ్యారు. 12 బంతుల్లో 14 పరుగులు చేయవలిసిన దశలో స్టీవ్ స్మిత్(12) కూడా ఔట్ కావడంతో రాజస్థాన్ కష్టాలో పడింది. చివరి ఓవర్ లో 6 పరుగులు చేయాల్సిన దశలో శ్రేయాస్ గోపాల్(13), కృష్ణప్ప గౌతమ్(0) జట్టును గెలిపించారు. 4 పరుగులు కావలసిన దశలో శ్రేయాస్ గోపాల్ ఫోర్ తో మెరిశాడు. ముంబై చివరిలో రెండు క్యాచులు మిస్ చేయడం కూడా రాజస్థాన్ కు కలిసొచ్చింది. 

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబైకు ఓపెనర్స్ భారీ పునాది వేశారు. తొలి వికెట్ కు ముంబై ఓపెనర్స్ 96 పరుగులు జోడించారు. 96 పరుగుల వద్ద రోహిత్ శర్మ (47) అవుటయ్యాడు. 32 బంతులు ఆడిన రోహిత్ 6 ఫోర్లు, సిక్సర్‌తో 47 పరుగులు చేసి అర్ధ సెంచరీ ముందు అవుటయ్యాడు.

మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 34 బంతులు ఎదుర్కొన్న డికాక్ 2 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అర్ధ సెంచరీ చేశాడు. జట్టు స్కోరు 117 పరుగుల వద్ద సూర్య కుమార్ యాదవ్(17)ని కులకర్ణి ఔట్ చేశాడు. పోలార్డ్(6) కూడా వెంటనే ఔట్ కావడంతో జట్టు స్కోరు మందగించింది. ఈ క్రమంలో డికాక్-హార్దిక్ పాండ్య విజృభించి ఆడారు.

జట్టు స్కోరు 163 పరుగుల వద్ద డికాక్ ని ఆర్చర్ ఔట్ చేశాడు. 52 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో డికాక్ 81 పరుగులు చేశాడు. ఆ తరువాత ఇషాన్ కిషన్(5) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 20 ఓవర్లు ముగిసే సరికి హార్దిక్ పాండ్య(28), క్రునాల్ పాండ్య(0) నాటౌట్ గా నిలిచారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ మూడు వికెట్లు, కులకర్ణి, ఉనాద్కట్ చెరి ఒక వికెట్ తీశారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle