newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మిథాలీ లేకుండా వరల్డ్‌కప్‌ సాధ్యమేనా..?

18-02-202018-02-2020 16:33:59 IST
2020-02-18T11:03:59.689Z18-02-2020 2020-02-18T11:03:52.444Z - - 23-04-2021

మిథాలీ లేకుండా వరల్డ్‌కప్‌ సాధ్యమేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహిళల టీ20 వరల్డ్ కప్‌ ఆస్ట్రేలియా వేదికగా మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. 17 రోజులపాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌ అంతర్జాతీయ మహిళల దినోత్సవం మార్చి 8న విఖ్యాత మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఇప్పటికే టైటిల్‌ వేట కోసం 10 జట్లు ఆస్ట్రేలియాకు చేరుకున్నాయి. భారత మహిళల జట్టు మూడు వారాల క్రితమే ఆస్ట్రేలియా చేరుకుంది. కాగా ఇప్పటివరకు ఆరు టి20 ప్రపంచకప్‌లలో భారత్‌ మూడుసార్లు సెమీఫైనల్స్‌లోకి (2009, 2010, 2018) దూసుకెళ్లింది. అయితే టైటిల్‌ సమరానికి ఒక్కసారీ అర్హత పొందలేకపోయింది. కానీ ఈసారి సెమీఫైనల్‌ అడ్డంకిని దాటడమే కాకుండా కప్పుతో తిరిగి రావాలని కృతనిశ్చయంతో ఉంది.

10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ‘ఎ’ గ్రూప్‌లో ఐదు జట్లు (ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్‌).. ‘బి’ గ్రూప్‌లో ఐదు జట్లు (ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, థాయ్‌లాండ్‌) ఉన్నాయి. లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండేసి జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. సెమీఫైనల్స్‌లో నెగ్గిన రెండు జట్లు మార్చి 8న ఫైనల్లో టైటిల్‌ కోసం తలపడతాయి. విజేత నిలిచిన జట్టుకు 10 లక్షల అమెరికన్‌ డాలర్లు (రూ. 7 కోట్ల 14 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. రన్నరప్‌ జట్టుకు 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 57 లక్షలు) అందజేస్తారు.  

మిథాలీరాజ్‌ లేకుండానే..

క్రికెట్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు మిథాలీరాజ్‌. 20ఏళ్ల కెరీర్‌లో ఆమె ఘనతలు అందరికీ తెలుసు. 10టెస్టులు 209వన్డేలు, 89టీ20ల అనుభవానికి ఆమె ప్రతిరూపం. అంతర్జాతీయ క్రికెట్లో రికార్డుల రారాణి. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌వుమెన్‌. అన్ని ఫార్మాట్లలో 9000వేలకు పైగా పరుగులు చేసి ఔరా అనిపించింది. అందుకే ఆమెను విదేశీ క్రికెటర్లు సైతం ఎంతో గౌరవిస్తారు. సుధీర్ఘ అనుభవమున్న మిథాలీ తమకు ఆదర్శమని చెబుతారు.

14ఏళ్లకే జాతీయ జట్టుకు ఎంపికైన ఈహైదరాబాదీ అరగ్రేటంలోనే శతకం బాదేసి సంచలనం సృష్టించింది. 32 టీ20ల్లో సారధ్యం వహించి 17 విజయాలు అంకుంది. 132 వన్డేల్లో నాయకత్వం వహించగా.. విజయాల శాతం 41.34. ఇక వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియాను రెండుసార్లు ఫైనల్‌ కు చేర్చింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎనిమిది ఐసీసీ టోర్నీ పైనళ్లు ఆడిన మిథాలీ లేకపోవడం.. హర్మన్‌ప్రీత్ సేనకు లోటే.

హర్మన్‌ అండ..

మిథాలీ రాజ్‌ తరువాత అంతటి సినీయర్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌కౌర్‌. వరుసగా ఏడో ప్రపంచకప్‌లో ఆడుతోన్న ఆమె అనుభవం ఈసారి జట్టుకు పెద్ద అనుకూలాంశం. ధనాధన్‌ ఆటకు పెట్టింది పేరైన హర్మన్‌ క్రీజులో నిలదొక్కుకొని బ్యాట్‌ ఝళిపించిందంటే స్కోరు బోర్డుపై పరుగుల వరద పారాల్సిందే. 2018 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై హర్మన్‌ప్రీత్‌ కేవలం 51 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 103 పరుగులు చేసింది.

టి20ల్లో భారత్‌ తరఫున సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. ఓవరాల్‌గా కెరీర్‌లో 109 టి20 మ్యాచ్‌లు ఆడిన అనుభవమున్న హర్మన్‌ 2,156 పరుగులు సాధించింది. ఇందులో ఒక సెంచరీ, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఫీల్డర్‌గా 42 క్యాచ్‌లు పట్టిన హర్మన్‌ బంతితోనూ మెరిసి 29 వికెట్లు పడగొట్టింది. గత ప్రపంచకప్‌లో దొర్లిన పొరపాట్లను పునరావృతం చేయకుండా... పక్కా ప్రణాళికతో ఆడి.. హర్మన్‌ నాయకత్వానికి ఇతర సభ్యుల ప్రతిభ తోడైతే భారత్‌ ఈసారి అద్భుతం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Image result for t20 world cup 2020 womens team india

సమిష్టిగా..

జట్టు క్రీడ అయిన క్రికెట్‌లో ప్రతిసారీ ఒకరిద్దరి ప్రతిభ కారణంగా గెలవలేం. భారత మహిళల జట్టు తొలిసారి విశ్వవిజేతగా అవతరించాలంటే ఆల్‌రౌండర్‌ హర్మన్‌ప్రీత్‌కు ఆమె సహచరులు కూడా తమ నైపుణ్యంతో తోడ్పాటు అందించాల్సిందే. ముందుగా ఓపెనర్లు స్మృతి మంధాన, 16 ఏళ్ల టీనేజ్‌ సంచలనం షఫాలీ వర్మ శుభారంభం ఇచ్చి గట్టి పునాది వేస్తే... ఆ తర్వాత 19 ఏళ్ల జెమీమా రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ తదితరులు ఇన్నింగ్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారు. ఇక బౌలింగ్‌లో సీనియర్‌ పేసర్‌ శిఖా పాండే, హైదరాబాద్‌ అమ్మాయి అరుంధతి రెడ్డి, పూజ వస్త్రకర్, స్పిన్నర్లు రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, పూనమ్‌ యాదవ్‌ విజృంభిస్తే భారత్‌ జైత్రయాత్రను ఎవరూ ఆపలేరు.

Image result for t20 world cup 2020 womens team india


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle