మాజీ క్రికెటర్ వసంత్ రాయ్ జీ ఇకలేరు
13-06-202013-06-2020 12:33:16 IST
2020-06-13T07:03:16.904Z13-06-2020 2020-06-13T07:02:57.794Z - - 17-04-2021

భారత్‌లో తొలి తరం క్రికెటర్లలో ఒకరుగా అత్యంత వృద్ధుడిగా రికార్డుకెక్కిన వసంత్ రాయ్‌జీ ఇకలేరు. అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. అగ్రశ్రేణి క్రికెటర్ గా క్రికెట్ చరిత్రకారుడుగా ఆయన ప్రఖ్యాతి పొందారు. వసంత్ రాయ్‌జీ వయసు వందేళ్ళు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దక్షిణ ముంబైలోని చందన్వాడి శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించనున్నారు.
దక్షిణ ముంబైలోని వాల్కేశ్వర్ లోని తన నివాసంలో నిద్రలో ఈ తెల్లవారుజామున 2.20 గంటలకు రాయ్‌జీ కన్నుమూశారని ఆయన అల్లుడు సుదర్శన్ నానావతి ప్రకటించారు. 1920 జనవరి 26న గుజరాత్ లోని బరోడాలో జన్మించిన రాయ్‌జీ 1939లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా జట్టు తరపున క్రికెట్ ఆడడం ప్రారంభించారు. కుడిచేతి వాటం బ్యాట్స్ మన్ అయిన ఆయన 1949-50 వరకు బరోడా, ముంబై జట్టుకు సేవలందించారు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆయన విశేష సేవలందించారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అనంతరం క్రికెట్‌పై అనేక రచనలు చేసి క్రికెట్ చర్రితకారుడుగా పేరు పొందారు. భారత్‌లో తొలి తరం క్రికెటర్లలో ఒకరుగా అత్యంత వృద్ధుడిగా రికార్డుకెక్కిన వసంత్ రాయ్‌జీ ఇటీవల 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, స్టీవ్ వా కేక్ కట్ చేయించి వేడుక చేశారు. వసంత్ రాయ్ జీ ఆకస్మిక మృతికి పలువురు ప్రముఖులు,క్రికెటర్లు సంతాపం ప్రకటించారు.
వసంత్ రాయ్ మృతికి సంతాపం తెలిపారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. క్రికెట్ కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని, ఈతరం క్రీడాకారులకు ఆయనే ఆదర్శం అన్నారు సచిన్. వసంత్ రాయ్ జీ కుటుంబానికి సానుభూతి తెలిపారు.


CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?
14 hours ago

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్
15-04-2021

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే
15-04-2021

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
15-04-2021

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
15-04-2021

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ
15-04-2021

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!
15-04-2021

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!
15-04-2021

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
14-04-2021

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
14-04-2021
ఇంకా