newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మాజీ కెప్టెన్ ధోనీకు తలుపులు మూసుకుపోయినట్లే: సెహ్వాగ్

19-03-202019-03-2020 11:16:56 IST
2020-03-19T05:46:56.854Z19-03-2020 2020-03-19T05:46:54.311Z - - 11-04-2021

మాజీ కెప్టెన్ ధోనీకు తలుపులు మూసుకుపోయినట్లే:  సెహ్వాగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాలు సాధించిపెట్టిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్ ముగిసినట్లేనా.. ఐపీఎల్ వాయిదా నేపథ్యంలో ఈ సారి టోర్నీ జరుగుతుందో లేదో కూడా తెలీని పరిస్థితుల్లో ఐపీఎల్‌లో ప్రదర్శన ప్రాతిపదికన టీమిండియాలోకి తిరిగి రావాలని ధోనీ పెట్టుకున్న ఆశలు ఇక గల్లంతేనా?

అవునే స్పష్టం చేస్తున్నాడు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌. మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని భారత జట్టులోకి రావడం ఇక కష్టమేనని పేర్కొన్నాడు. ధోని స్థానంలో ఆటగాడిని భర్తీ చేయడానికి బీసీసీఐ ఎంతో ముందుకు వెళ్లిపోయిందని అభిప్రాయపడ్డాడు. 

'జట్టులో ధోనికి చోటు ఎక్కడుంది.. ఇప్పటి టీంతో అతడు ఆడలేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా రాహుల్‌ను చూసుకుంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌లలోఅద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇంకా ధోనీ గురించి ఆలోచించేందుకు కారణం ఏముంటుంది' అని అన్నాడు.

అదే సమయంలో న్యూజిలాండ్‌ పర్యటనలో విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి సెహ్వాగ్‌ మద్దతుగా నిలిచాడు. 'కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. కానీ ప్రతి ఆటగాడు తన కెరీర్‌లో ఒక సంధి దశను ఎదుర్కొంటాడు. ప్రస్తుతం కోహ్లి కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. గతంలో దిగ్గజ ఆటగాళ్లకు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. సచిన్‌ టెండూల్కర్, స్టీవ్‌ వా, జాక్వెస్‌ కలిస్‌, రికీ పాంటింగ్‌ లాంటి అత్యుత్తమ ఆటగాళ్లు గడ్డుకాలం ఎదుర్కొన్నారు అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

వన్డే, టెస్టుల్లో కివీస్‌ మన కన్నా అత్యుత్తమంగా ఆడిందని ఒప్పుకోవాల్సిందే. వన్డేల్లో కివీస్‌ తన మార్క్‌  స్పష్టంగా చూపెట్టింది. టీ20ల్లోనూ విజయాలకు దగ్గరగా వచ్చి ఓడిపోయింది. అయితే పొట్టి క్రికెట్లో వెంటనే పుంజుకోవడం అంత సులభం కాదు' అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. 

కాగా ఐసీసీ 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఎంఎస్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత భారత్ ఆడిన ఏ సిరీస్‌కూ అందుబాటులో లేడు. దీంతో మహీ భవితవ్యంపై సందేహాలు తలెత్తాయి. దీంతో పాటు ఆరు నెలలుగా ధోనీ క్రికెట్ ఆడకపోవడంతో బీసీసీఐ అతడి కాంట్రాక్టును పునరుద్ధరించలేదు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఐపీఎల్‌-13వ సీజన్‌పై పడింది.

ఐపీఎల్‌ ప్రదర్శనతో అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ధోనిని చూడాలని అతని అభిమానులు ఎంతగానో భావించారు. దీనికి తోడు మహీ కూడా ఐపీఎల్ కోసం చెన్నై వచ్చి ప్రాక్టీస్ చేసాడు. అయితే కరోనా ముప్పుతో ప్రస్తుతం ఐపీఎల్‌ వాయిదా పడింది. పరిస్థితులు మెరుగవ్వకపోతే టోర్నీని రద్దు చేసే అవకాశం ఉంది. 

అదే జరిగితే ధోనీ పరిస్థితి ఏంటో తెలియడం లేదు.కొందరు మాజీలు రిటైర్మెంట్ ప్రకటించాలని సూచించగా.. మరికొందరు ఆడాలని సూచిస్తున్నారు. ఏదిఏమైనా అన్ని ఫార్మాట్లలో భారత్‌కు ప్రపంచ కప్ ట్రోపీలు సాధించిపెట్టిన ధోనీ కెరీర్ ఇంత డోలాయమాన పరిస్థితుల్లో చిక్కుకుపోవడం విషాదం అనే చెప్పాలి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle