newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మాక్స్‌వెల్‌ విధ్వంసం.. ఉత్కంఠ మ్యాచ్‌లో గెలిచిన ఆసీస్‌

17-09-202017-09-2020 12:41:56 IST
2020-09-17T07:11:56.643Z17-09-2020 2020-09-17T07:11:51.987Z - - 19-04-2021

మాక్స్‌వెల్‌ విధ్వంసం.. ఉత్కంఠ మ్యాచ్‌లో గెలిచిన ఆసీస్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
300 పరుగులకు పైగా లక్ష్యం. చేధనలో 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయారు. ఈ స్థితిలో ఉన్న ఏ జట్టు అయిన గెలుస్తుంది అని అనుకుంటారా..? కానీ పోరాటానికి పెట్టింది పేరైనా ఆస్ట్రేలియా మరోసారి తన ఆటతీరుతో చివరి వరకు పోరాడారు. ఫలితం.. ఓ దశలో ఓడిపోతామని అనుకున్న మ్యాచ్‌ను మూడు వికెట్ల తేడాతో గెలవడంతో పాటు టీ 20 సిరీస్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. 303 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్‌ను.. మ్యాక్స్‌వెల్‌(108; 90బంతుల్లో 4పోర్లు, 7 సిక్సర్లు), కారే(106; 114బంతుల్లో 7పోర్లు, 2 సిక్సర్లు)లు సెంచరీతో కదంతొక్కి విజయతీరాలకు చేర్చారు. దీనితో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది.

అంతముందు టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ డకౌట్‌ అయినా.. మరో ఓపెనర్‌ బెయిర్‌ స్టో(112; 126 బంతుల్లో 12 పోర్లు, 2 సిక్సర్లు) అద్భుత శతకం బాదాడు. ఇయాన్‌ మోర్గాన్‌(23), బట్లర్‌(8) విఫలమైనా.. సామ్‌ బిల్డింగ్స్‌(57; 58బంతుల్లో 4పోర్లు, 2 సిక్సర్లు) క్రిస్‌ వోక్స్‌(53; 39బంతుల్లో 6పోర్లు) అర్థశతకాలు సాధించడంతో ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. స్టార్క్‌, జంపా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. కమిన్స్‌కు ఓ వికెట్‌ దక్కింది.

అనంతరం 303 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. 12 పరుగులు చేసిన ఆరోన్‌ ఫించ్‌ జట్టు స్కోర్‌ 21 వద్ద మొదటి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరువాత కూడా ఇంగ్లాండ్‌ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఆసీస్‌ 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశంలో ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీలు సమయోచితంగా ఆడారు. ముందు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డ ఈ జోడి.. కుదురుకున్న తరువాత పరుగుల వేటలో నిమగ్నమైంది. కేరీ నిదానంగా ఆడగా.. మాక్స్‌వెల్‌ మాత్రం బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. వీరిద్దరు ఆరో వికెట్‌ 212 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు స్కోర్‌ 285 వద్ద మాక్స్‌వెల్, 293 వద్ద కేరీ ఔట్‌ కాగా.. మిగిలిన లాంచనాన్ని కమిన్స్‌(4*), స్టార్క్‌(11*) పూర్తి చేశారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో వోక్స్‌, రూట్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. అర్బర్‌, రషీద్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఈ విజయంతో ఆసీస్‌ మూడు వన్డేల సిరీస్‌ 2-1తో కైవసం చేసుకుంది. ఇరు జట్ల సిరీస్‌ ముగియడంతో.. ఇంగ్లాండ్‌, ఆసీస్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొనేందుకు యూఏఈ వెళ్లనున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle