newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మహిళల ఫైనల్‍‌ని వందకోట్లపైగా కళ్లు వీక్షిస్తాయని ఊహించలేదు: గంభీర్

09-03-202009-03-2020 12:45:59 IST
2020-03-09T07:15:59.199Z09-03-2020 2020-03-09T07:15:56.870Z - - 22-04-2021

మహిళల ఫైనల్‍‌ని వందకోట్లపైగా కళ్లు వీక్షిస్తాయని ఊహించలేదు: గంభీర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మెల్‌బోర్న్ ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాలో చేతిలో ఓటమి పాలైన భారత జట్టుకు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, మాజీ బ్యాట్స్‌మన్ గౌతం గంభీర్ అండగా నిలిచారు. ప్రపంచకప్‌లో భారత జట్టు బాగా పోరాడిందని కోహ్లీ ప్రశంసించాడు. ఫైనల్లో ఆతిథ్య జట్టు చేతిలో ఓటమి వారిని మరింత బలంగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘ప్రపంచకప్ మొత్తం మీరు పోరాడిన తీరు చూసి గర్వంగా ఉంది. మీరు పుంజుకుని మరింత బలంగా వస్తారన్న నమ్మకం నాకుంది’’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా, మయాంక్ అగర్వాల్ కూడా భారత అమ్మాయిలను కీర్తిస్తూ ట్వీట్లు చేశారు. 

టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ కూడా మహిళా జట్టును కీర్తించాడు. మహిళల ప్రపంచకప్‌ను వంద కోట్ల కళ్లు వీక్షిస్తాయని కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎవరూ ఊహించలేదన్నాడు. కప్పులు వస్తుంటాయి, పోతుంటాయని, కానీ ఈ విజయం సామాజిక అడ్డంకులను, అసమానతలను ఎదిరించిన ప్రతీ భారతీయ అమ్మాయిదీ అని గంభీర్ ట్వీట్ చేశాడు.  

ఆదివారం జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ ప్రపంచ రికార్డును తిరగరాసింది. 86,714 మంది ఈ మ్యాచ్‌ను వీక్షించారు. ఓ మహిళా క్రీడను ఇంతమంది వీక్షించడం ఆస్ట్రేలియాలో ఇదే తొలిసారి. 

ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఘోర ఓటమిపై టీమిండియా సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించింది. మ్యాచ్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆటలో గెలుపోటములు సహజమని పేర్కొంది. కొన్నిసార్లు గెలిస్తే, మరొకొన్ని సార్లు ఓటమి చవి చూడాల్సి వస్తుందని చెప్పింది. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందని వివరించింది. 

ప్రపంచకప్‌ లీగ్ దశలో అన్ని మ్యాచుల్లోనూ బాగానే ఆడామని, దురదృష్టవశాత్తు ఫైనల్లో ఓడిపోయామని ఆవేదన వ్యక్తం చేసింది. కీలకమైన మ్యాచ్‌లో క్యాచ్‌లు జారవిడిచామని తెలిపింది. జట్టుపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తిరిగి పుంజుకుని సత్తా చాటుతామని ఆశాభావం వ్యక్తం చేసింది. వచ్చే ఏడాదిన్నర తమకు ఎంతో ముఖ్యమని, ఫీల్డింగ్‌పై దృష్టి సారిస్తామని చెప్పుకొచ్చింది. 

వాస్తవానికి 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు ఆసీస్ ఓపెనర్ అలీసా హీలీ ఇచ్చిన క్యాచ్‌ను షెఫాలీ వర్మ నేలపాలు చేసింది. ఇందుకు భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత హీలీ చెలరేగి ఆడి 75 పరుగులు చేసింది. 

అయితే హేలీ ఇచ్చిన ఆ అరుదైన క్యాచ్‌ను విడిచిపెట్టిన షెఫాలీని నిందించలేమని హర్మన్ పేర్కొంది. 16 ఏళ్ల వయసులో తొలి ప్రపంచకప్ ఆడుతున్న షెఫాలీ జట్టు కోసం గొప్పగా పోరాడిందని ప్రశంసించింది. ఈ వయసులో అంత సానుకూల దృక్పథంతో ఆడడం ఎంతో కష్టమని హర్మన్ తెలిపింది.

గతేడాది సెప్టెంబర్ నెలలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 16 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం షఫాలీ వర్మ ఆరు నెలల కాలంలోనే ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచకప్‌లో మూడు మ్యాచుల్లో 11 బౌండరీలు, 8 సిక్స్‌లతో మొత్తంగా 114 పరుగులు చేసి 172.7 స్టైక్‌రేట్‌ను నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక టీ20 మ్యాచ్‌లలో 146.96 స్ట్రైక్ రేట్‌తో 485 పరుగులు చేసింది. 

పైనల్లో ఒక్క పరుగూ సాధించకముందే అతి పిన్న వయసులో ప్రపంచ కప్ ఫైనల్లో ఆడిన భారత్ ప్లేయర్‌గా కూడా షెఫాలీ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ఆమె భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ని సైతం అధిగమించడం గమనార్హం.

బీసీసీఐ కూడా మహిళా జట్టును వెనకేసుకొచ్చింది. ఈరోజు ఫలితం ఇలా వస్తుందని మేం ఊహించలేదు. కానీ టోర్నమెంట్ పొడవునా టీమిండియా మహిళా జట్టు ప్రదర్శించిన ఆటతీరు పట్ల గర్విస్తున్నాం అని బీసీసీఐ ట్వీట్ చేసింది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle