newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మహిళల టీ20కి వర్షం ముప్పు.. ఆనందంలో హర్మన్‌ప్రీత్ సేన

05-03-202005-03-2020 08:55:45 IST
2020-03-05T03:25:45.348Z05-03-2020 2020-03-05T03:25:43.223Z - - 11-04-2021

మహిళల టీ20కి వర్షం ముప్పు.. ఆనందంలో హర్మన్‌ప్రీత్ సేన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహిళల టీ20 ప్రపంచకప్‌ తుది అంకానికి చేరుకుంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న పొట్టి కప్‌ సమరంలో పైనల్‌లో చోటు కోసం నాలుగు జట్లు తలపడనున్నాయి. గురువారం సిడ్ని వేదికగా రెండు సెమీఫైనల్స్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి సెమీఫైనల్‌లో భారత జట్టు ఇంగ్లాండ్‌ జట్టుతో తలపడనుంది. ఇక రెండో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా జట్టును ఢీకొననుంది. ఎలాగైనా సెమీఫైనల్‌ మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌లో చోటు దక్కించుకోవాలని నాలుగు జట్లు ఆరాటపడుతున్నాయి.

కాగా.. ప్రస్తుతం సిడ్నీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే అక్కడ జరగాల్సిన రెండు లీగ్‌ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. వర్షం కారణంగా సెమీఫైనల్‌ మ్యాచులు రద్దయితే.. భారత్‌, దక్షిణాఫ్రికా జట్లకు ఎక్కువ లాభం. ఎందుకంటే.. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే.. మ్యాచ్‌ను మరుసటి రోజు కొనసాగించడానికి రిజర్వు డే అందుబాటులో లేదు.

ఐసీసీ నియమావళి ప్రకారం గ్రూప్‌ స్టేజ్‌లలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు వెళతాయి. గ్రూప్‌-ఏ నుంచి భారత్‌.. గ్రూప్‌-బి నుంచి సౌతాఫ్రికాలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే.. భారత్‌, సౌతాఫ్రికా జట్లు నేరుగా సైమీపైనల్‌కు చేరుకుంటాయి.  

ఇదిలా ఉంటే.. వర్షం ముప్పు నేపథ్యంలో.. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకి రిజర్వ్ డే ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అభ్యర్థించింది. కానీ.. ఐసీసీ మాత్రం ఆ అభ్యర్థనని తిరస్కరిస్తూ.. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయబోమని ప్రకటించింది. దీంతో.. సొంతగడ్డపై సెమీస్ మ్యాచ్‌కి ముందే ఆస్ట్రేలియాలో కంగారు మొదలైంది. మరోవైపు లీగ్ దశ పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన భారత్.. మ్యాచ్ రద్దయితే ఫైనల్ చేరనుండటంతో హ్యాపీగా ఉంది. కాగా పైనల్‌ మ్యాచ్‌ మార్చి 8వ తేదీన జరగనుంది.

కాగా ఇప్పటి వరకు వరల్డ్‌కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌లాడిన భారత్.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లపై విజయం సాధించింది. అదే ఊపులో సెమీస్‌, ఫైనల్‌లో విజయం సాధించి టైటిల్‌ను గెలవాలని భావిస్తోంది.

ఆ ఓటమి తర్వాతనే ఆలోచించాం..

కాగా భారత మహిళల జట్టు ప్రదర్శన పట్ల కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్‌ సంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా భారత ఓపెనర్‌ షెఫాలీ వర్మపై ప్రశంసల జల్లు కురిపించింది. ఇతరుల ఒత్తిడిని షెపాలీ తొలగిస్తుందని, ఎల్లప్పుడూ జట్టు కోసం ఆడడానికి ప్రయత్నిస్తుందని తెలిపింది. అలాంటి ప్లేయర్‌ ఉండాలని ప్రతి జట్టు కోరుకుంటుంది. దేశం కోసం ఆడాలనుకునేవారు ఉత్తమ ప్రదర్శన చేయడానికే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు. జట్టు కోసం పోరాడటాన్ని షెఫాలీ ఎంతో ఆస్వాదిస్తుందని వెల్లడించింది.

మేం ఎంతో కాలం నుంచి కలిసి ఆడుతున్నాం. ఇతరుల దగ్గర నుంచి కూడా క్రికెట్‌ నేర్చుకుంటున్నాం. అందుకే జట్టుగా రాణిస్తున్నాం. అయితే వ్యక్తిగత ఉత్తర ప్రదర్శనలు చేయడానికి ప్రయత్నించాలి. గత సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమి చవిచూశాక సమిష్టిగా సత్తాచాటాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఇప్పుడు జట్టు విజయాలు సాధిస్తున్నాం. మేం కేవలం ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లపై ఆధారపడట్లేదు. గతం గురించి కాకుండా ప్రస్తుతం గురించే ఆలోచిస్తున్నాం. జట్టుగా మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశిస్తున్నానని తెలిపింది. 2018లో ఇంగ్లాండ్‌తోనే సెమీస్‌ జరగగా టీమిండియా ఓటమి చవిచూసింది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle