మరో భారీ స్టేడియం.. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రయత్నం
05-07-202005-07-2020 17:10:46 IST
Updated On 05-07-2020 17:14:10 ISTUpdated On 05-07-20202020-07-05T11:40:46.078Z05-07-2020 2020-07-05T11:40:20.719Z - 2020-07-05T11:44:10.076Z - 05-07-2020

దేశంలో క్రికెట్ పోటీలకు రంగం సిద్ధం అవుతోంది. కరోనా వైరస్ సోకకుండా, ప్రేక్షకులను అనుమతించకుండా పోటీలు నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది. ఇండియాలో మరో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రంగం సిద్ధమైంది. 75 వేల సీటింగ్ కెపాసిటీతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్ సీఏ) స్టేడియం నిర్మాణానికి ప్లాన్ చేసింది. ఇందు కోసం రూ.550 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే మూడో అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా నిలవనుంది. జైపూర్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఢిల్లీ హైవేలో 100 ఎకరాల స్థలంలో ఈ స్టేడియంను నిర్మిస్తున్నామని ఆర్ సీఏ సెక్రటరీ మహేంద్ర శర్మ ప్రకటించారు. మరో నాలుగు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించి, రెండేళ్లలో స్టేడియంను అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. క్రికెట్ ఫెసిలిటీస్ తోపాటు ఇండోర్ గేమ్స్ , ట్రెయినింగ్ అకాడమీలు, క్లబ్ హౌస్ , 4000 వాహనాలు సరిపడే పార్కింగ్ లాట్ వంటి సదుపాయాలు ఇందులో ఉంటాయని చెప్పారు. 1.10 లక్షల కెపాసిటీతో ఈ మధ్యే నిర్మితమైన ఇండియాలోని మొతెరా స్టేడియం బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం కాగా.. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లక్ష పైచిలుకు కెపాసిటీతో తర్వాతి స్థానంలో ఉంది. క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు వీలుగా అన్ని సదుపాయాలు ఇందులో వున్నాయి. రెండు రెస్టారెంట్లు, 30 ప్రాక్టీస్ నెట్ లు, ప్రెస్ కాన్ఫరెన్స్ రూంలు ఇక్కడ వున్నాయి. మరో నాలుగు నెలల్లో నిర్మాణం ప్రారంభం అవుతుందని, క్రికెట్ అభిమానులకు మంచి అనుభూతి కలిగేలా ఈ స్టేడియం వుంటుందని ఆర్సీయే సెక్రటరీ మహేంద్ర శర్మ చెప్పారు. ఆర్సీయేకి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ గెహ్లాట్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాడు. వైభవ్ మానసపుత్రికగా ఈ స్టేడియం రూపుదిద్దుకోనుంది.

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
5 hours ago

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
6 hours ago

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
13-04-2021

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
12-04-2021

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను
12-04-2021

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!
12-04-2021

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
11-04-2021

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
11-04-2021

IPL 2021: అతడే మా తురుపుముక్క.. హర్షల్‌పై కోహ్లీ ప్రశంసలు
11-04-2021

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
10-04-2021
ఇంకా