newssting
BITING NEWS :
మహారాష్ట్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికతో కూడిన మహావికాస్ ఆఘాదీ ప్రభుత్వం స్వయంగా కుప్పకూలిపోతుందన్న ఫడణవీస్. కూటమిని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ ఏం చేయనవసరం లేదని చెప్పిన ఫడణవీస్ * బీహార్ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయం. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించేందుకు వీలుగా 30వేల మంది కేంద్ర బలగాల జవాన్లతో ఏర్పాటు చేయనున్న బందోబస్తు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో కేంద్ర అదనపు బలగాలతో రక్షణ * చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల అగ్రరాజ్యంలోని దిగ్గజ కంపెనీల ఆగ్రహం. 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో కేసులు వేసిన 3,500 కంపెనీలు * కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సావళగి క్రాస్‌ అళంద రోడ్డుపై తెల్లవారుజామున రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. నెలలు నిండిన మహిళకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రమాదం * 286వ రోజుకు చేరుకున్న అమరావతి రాజధాని రైతుల ఉద్యమం. గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం * ఏపీ‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి. బ్రహ్మోత్సవాల అనంతరం స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వెల్లంపల్లి * ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణా నది. కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. ప్రాజెక్టు వద్ద 6,65,925 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచన * తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ * యాదాద్రి-భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం ప్రొద్దుటూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాని కుప్పకూలిన పెంకుటిల్లు. అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు. శబ్దాన్ని గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు వెంటనే బయటకు రావడంతో తప్పిన ప్రాణాపాయం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. 20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 4,19,454 క్యూసెక్కులుగా ఉన్న ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.252 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు * రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తెలంగాణ ఎంసెట్ పరీక్ష. ఉదయం, మధ్యాహ్నం రెండు షెషన్‌లలో పరీక్ష నిర్వహణ. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 84 సెంటర్లలో పరీక్షను నిర్వహణ. తెలంగాణలో 67, ఆంధ్రాలో 17 పరీక్షా కేంద్రాలు

మరోసారి తన మంచి మనసును చాటుకున్న సచిన్ టెండూల్కర్..!

15-09-202015-09-2020 08:16:37 IST
2020-09-15T02:46:37.702Z15-09-2020 2020-09-15T02:46:33.789Z - - 28-09-2020

మరోసారి తన మంచి మనసును చాటుకున్న సచిన్ టెండూల్కర్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సచిన్ టెండూల్కర్.. సామాజిక సేవలో ఎప్పటి నుండో ముందు ఉంటారు. గతంలో గ్రామాలను దత్తత తీసుకోవడం, పిల్లలకు స్కాలర్ షిప్ లు అందించడం, ప్రభుత్వాలకు తన వంతు సాయం చేయడం లాంటివి అందించాడు. మరోసారి ఆయన 560 మంది విద్యార్థులకు అండగా నిలిచారు. మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌ జిల్లాలోని సెవానియా, బీల్పాటి, ఖాపా, నయాపుర, జమున్‌ ఝిల్‌లోని గిరిజన తెగలకు చెందిన పాఠశాల విద్యార్థులు సరైన పోషకాహారం, విద్య అందక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉండడంతో సచిన్ ఎన్టీవో పరివార్‌ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆ విద్యార్థులకు సాయం అందించడానికి ముందుకు వచ్చారు.

తన 'టెండూల్కర్‌ ఫౌండేషన్‌' ద్వారా పిల్లలకు సరైన పోష్టికాహారం అందించనున్నారు. ఈ పిల్లలు బరేలా భిల్, గోండు తెగలకు చెందిన వారు. పిల్లల పట్ల సచిన్ టెండూల్కర్ కు ఉన్న ప్రేమ ఇదని మధ్యప్రదేశ్ లో పోష్టికాహారం లేకుండా ఉన్న పిల్లలకు సచిన్ సాయం అందించడానికి ముందుకు వచ్చారని ప్రెస్ స్టేట్మెంట్ లో తెలిపారు. పోష్టికాహారం కొనడానికి డబ్బులు కూడా లేని కుటుంబాలకు చెందిన వారు ఈ పిల్లలని తెలుస్తోంది.

యూనిసెఫ్‌కు గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సచిన్‌, చిన్నారుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. 'Early Childhood Development' మీద సచిన్ టెండూల్కర్ పలు మార్లు చెప్పుకొచ్చారు. ఈ మధ్యనే ముంబైలోని ఎస్‌ఆర్‌సీసీ పిల్లల ఆసుపత్రిలో చిన్నారులకు వైద్యం కోసం ఆయన ఆర్థిక సాయం చేశారు.

డిసెంబర్ 2019న 'Spreading Happiness InDiya Foundation' ( స్ప్రెడ్ హ్యాపీనెస్ ఇన్‌ దియా ఫౌండేషన్) ద్వారా డిజిటల్ తరగతి గదుల కోసం సౌర లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయించారు. ఇంకా తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి మంచి పనులు చేస్తూ ఉన్నారు సచిన్ టెండూల్కర్.  గతంలో ఎంపీగా ఉన్న సమయంలో కూడా తన ఎంపీ ల్యాడ్స్ ను పలు కార్యక్రమాలకు ఉపయోగించారు మాస్టర్ బ్లాస్టర్. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ తమకు ఎంతో అండగా నిలిచిందని ఇప్పటికే ఎంతో మంది పిల్లలు, తల్లిదండ్రులు సచిన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇండియా వర్సెస్ సెండప్ టీం మధ్య ఫేర్వెల్ మ్యాచ్


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle