newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మరికొద్ది గంటల్లో ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. ఫ్యాన్స్ వెయిటింగ్

29-08-202029-08-2020 09:24:35 IST
Updated On 29-08-2020 11:00:27 ISTUpdated On 29-08-20202020-08-29T03:54:35.629Z29-08-2020 2020-08-29T03:54:29.406Z - 2020-08-29T05:30:27.451Z - 29-08-2020

మరికొద్ది గంటల్లో ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. ఫ్యాన్స్ వెయిటింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వచ్చే 24 గంటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020 పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) చీఫ్‌ షేక్‌ నహ్‌యాన్‌ బిన్‌ముబారక్‌తో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సమావేశం ముగిసిందని సమాచారం తెలిసింది. 

దుబాయ్‌, షార్జా, అబుదాబిల మధ్య రాకపోకలు, నిబంధనల్లో సడలింపుల గురించి షేక్‌ నహ్‌యాన్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో ఐపీఎల్ 2020 షెడ్యూల్ ఎప్పుడైనా విడుదల కావొచ్చు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ జరుగుతుందని నెల క్రితమే ప్రకటించిన బీసీసీఐ.. అధికారిక షెడ్యూల్‌ను మాత్రం ఇంకా విడుదల చేయలేదు. దానికి కారణం.. ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్న దుబాయ్, షార్జా, అబుదాబీల్లో వైరస్ రూల్స్‌ కఠినంగా ఉండడమే. 

అబుదాబీలో అధికారులు రూల్స్ కఠినంగా అమలుచేస్తున్నారు. ఆ నగరంలోకి ఎవరైనా ఎంట్రీ ఇవ్వాలంటే.. 48 గంటల ముందు కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవాలి. అందులో నెగటివ్ వస్తేనే ఎంట్రీ. ఈ లెక్కన అబుదాబిలో ఆడే ప్రతి ఐపీఎల్ మ్యాచ్‌కి 48 గంటల ముందు క్రికెటర్లతో పాటు సహాయ సిబ్బంది, మ్యాచ్ అధికారులు తప్పనిసరిగా వైరస్ టెస్టు చేసుకోవాల్సి ఉంటుంది.

ఐపీఎల్‌ జట్లు వెంటవెంటనే ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అలాంటి ఆంక్షలుంటే కష్టమని బీసీసీఐ భావిస్తోంది. ఇక ఐపీఎల్‌లో ఆడే క్రికెటర్లతో పాటు సహాయ సిబ్బంది, మ్యాచ్ అధికారులు. టోర్నీ ఆరంభానికి ముందు నుంచే బయో సెక్యూర్ బబుల్‌లో ఉండనున్నారు. కాబట్టి వారికి మినహాయింపు ఇవ్వాలని బీసీసీఐ.. ఈసీబీ చీఫ్‌ షేక్‌ నహ్‌యాన్‌ బిన్‌ముబారక్‌ను కోరినట్లు తెలుస్తోంది.

ఈసీబీ చీఫ్‌ షేక్‌ నహ్‌యన్‌ యూఏఈలో సాంస్కృతిక, యువత అభివృద్ధి శాఖకు మంత్రి ప్రభుత్వంతో మాట్లాడి సడలింపులు చేయిస్తానని హామీ ఇచ్చారని తెలిసింది. శనివారం గ్రీన్‌సిగ్నల్ వచ్చే అవకాశం ఉన్నందున.. వెంటనే కొత్త షెడ్యూల్‌ని ప్రకటించాలని బీసీసీఐ భావిస్తోంది.

మరోవైపు ఐపీఎల్‌ 13వ సీజన్‌ కోసం అబుదాబిలో బస చేస్తున్న ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లకు భారీ ఉపశమనం లభించినట్లు సమాచారం తెలుస్తోంది. ముంబై, కోల్‌కతా జట్లకు ఇకపై ఔట్‌ డోర్‌లో సాధన‌ చేసుకునేందుకు అనుమతులు లభించాయట. ఈ రోజు నుండే ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి ఉంది.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle