newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

మనతో ఉన్నది ధోనీయేనా అనిపించేది.. షమీ జ్ఞాపకాలు

04-06-202004-06-2020 15:19:40 IST
Updated On 04-06-2020 15:39:53 ISTUpdated On 04-06-20202020-06-04T09:49:40.708Z04-06-2020 2020-06-04T09:49:38.306Z - 2020-06-04T10:09:53.954Z - 04-06-2020

మనతో ఉన్నది ధోనీయేనా అనిపించేది.. షమీ జ్ఞాపకాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా గత సారధి మహేంద్ర సింగ్ ధోనీ జట్టు సభ్యులతో గడిపే, మాట్లాడే విధానాన్ని చూస్తు అసలు మనతో ఉంటున్నది, కలిసి భోంచేస్తున్నది టీమిండియా కెప్టెన్ ధోనీయేనా అని సందేహం కలిగేదని భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ వ్యాఖ్యానించాడు. జూనియర్స్‌కు ధైర్యం చెప్పడంలో, సీనియర్స్‌కి బాధ్యతలను గుర్తు చేయటంలో ధోనీ ఒక అద్భుతమైన ఆటగాడంటూ షమీ ప్రశంసల వర్షం కురిపించాడు. అర్థరాత్రి వరకు అనేక విషయాలపై జూనియర్స్‌తో చర్చిస్తూ స్ఫూర్తి కలిగించిన ధోనీని నిజంగా మిస్సవుతున్నాని, తాను తిరిగి జట్టులోకి రావాలని షమీ కోరాడు.

టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనిపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ. మంగళవారం ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొన్న షమీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఐపీఎల్‌ మినహా ధోని సారథ్యం, మార్గనిర్దేశకంలో అన్ని ఫార్మట్లు ఆడాను. అతను జట్టు సభ్యులతో ఉండటం, మాట్లాడే విధానం చూస్తే అసలు మనతో ఉంది ధోనినేనా అనే అనుమానం కలిగేది. జూనియర్స్‌కు ధైర్యం చెబుతాడు. అదేవిధంగా సీనియర్స్‌కు వారి బాధ్యతలను గుర్తుచేస్తాడు. 

ధోని అత్యద్భుతమైన ఆటగాడు. అతనితో నాకు చాలా తీపి గుర్తులే ఉన్నాయి. ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటాను.. మహి భాయ్‌ తిరిగి జట్టులోకి రావాలి, మేమందరం మరోసారి సరదాగా ఆడాలి అని. ధోనితో కలిసి అందరం డిన్నర్‌ చేసేవాళ్లం. చాలా సరదాగా అనిపించేది. ఇక అతని చుట్టూ ఎప్పటికీ కనీసం ముగ్గురు నలుగురైనా ఉండేవారు. అర్దరాత్రి వరకు అనేక విషయాలపై ముచ్చటించేవాళ్లం. ఇవన్నీ మిస్సవుతున్నా. మళ్లీ ఆ రోజులు రావాలని కోరుకుంటున్నా’ అంటూ మహ్మద్ షమీ తన మనసులోని మాట బయటపెట్టాడు. 

కాగా, ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌-2019 అనంతరం ధోని మళ్లీ టీమిండియా జెర్సీ ధరించలేదు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ధోని ప్రదర్శన ఆధారంగా తిరిగి జట్టులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఐపీఎల్‌ నిరవధికా వాయిదా పడింది. దీంతో ధోని పునరాగమనంపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ధోని రిటైర్మెంట్‌పై, భవిష్యత్‌ ప్రణాళికలపై సోషల్‌ మీడియాలో అనేక వార్తలు వస్తున్నప్పటికీ అతడు ఇప్పటిరకు స్పందించలేదు. 

ప్రస్తుతం భారత క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో షమీ రెగ్యులర్ బౌలర్‌గా రూపొందాడు. గత కొన్ని సంవత్సరాలుగా షమీ అద్భుతమైన ఫిట్‌నెస్ సాధించి జట్టుకు తలమానికంగా మారాడు. ఇక విరాట్ కోహ్లీ సారధ్యంలో షమీని సెకండ్ ఇన్నింగ్స్ స్పెషల్ షమీగా పిలుస్తున్నారంటే మ్యాచ్ విన్నింగ్‌లో షమీ పాత్ర ఏమిటో తెలుస్తుంది. టెస్టు మ్యాచ్‌లలో రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు సాధించడంలో షమీ ఆరితేరిపోయాడు. అయితే షమీ తన కెరీర్‌ని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో ప్రారంభించాడు. అందుకే ధోనీ జ్ఞాపకాలు ఇంకా షమీని వదలనట్లున్నాయి.

జెర్మన్ బ్లాక్ వుడ్ వీరవిహారం.. ఆతిథ్య దేశానికి షాక్

జెర్మన్ బ్లాక్ వుడ్ వీరవిహారం.. ఆతిథ్య దేశానికి షాక్

   2 hours ago


కోహ్లీని ఆర్సీబీ ఏనాడూ లెక్కపెట్టలేదు.. కప్పు ఎలా గెలుస్తాడు.. చోప్రా ధ్వజం

కోహ్లీని ఆర్సీబీ ఏనాడూ లెక్కపెట్టలేదు.. కప్పు ఎలా గెలుస్తాడు.. చోప్రా ధ్వజం

   12-07-2020


ఇంగ్లాండ్‌కి చెమటలు పట్టించిన విండీస్ టీం

ఇంగ్లాండ్‌కి చెమటలు పట్టించిన విండీస్ టీం

   11-07-2020


కోహ్లీపై వత్తిడి పెరుగుతోందా?

కోహ్లీపై వత్తిడి పెరుగుతోందా?

   11-07-2020


ఆ మాట చెప్పడానికి దాదా ఎవరు.. పాక్‌ ధ్వజం.. గంగూలీకే జైకొట్టిన ఏసీసీ

ఆ మాట చెప్పడానికి దాదా ఎవరు.. పాక్‌ ధ్వజం.. గంగూలీకే జైకొట్టిన ఏసీసీ

   11-07-2020


విండీస్ కెప్టెన్ జేసాన్ హోల్డర్ వీరవిహారం

విండీస్ కెప్టెన్ జేసాన్ హోల్డర్ వీరవిహారం

   10-07-2020


గారాల పట్టి సమైరాతో రోహిత్ టైం పాస్

గారాల పట్టి సమైరాతో రోహిత్ టైం పాస్

   10-07-2020


ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ తొలి టెస్ట్.... వర్షం ఆటంకం

ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ తొలి టెస్ట్.... వర్షం ఆటంకం

   09-07-2020


ఆసియాకప్‌ 2020 వాయిదా.. విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణ అసాధ్యం.. గంగూలీ

ఆసియాకప్‌ 2020 వాయిదా.. విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణ అసాధ్యం.. గంగూలీ

   09-07-2020


కరోనా వేళ.. వెస్టిండీస్ టీం సాహసం

కరోనా వేళ.. వెస్టిండీస్ టీం సాహసం

   08-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle