newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

మంధాన దూకుడు... విరాట్ రికార్డు బ్రేక్

08-11-201908-11-2019 09:20:24 IST
2019-11-08T03:50:24.594Z08-11-2019 2019-11-08T03:50:22.487Z - - 26-05-2020

మంధాన దూకుడు... విరాట్ రికార్డు బ్రేక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌ మహిళలతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. మూడో వన్డేలో భారత మహిళలు ఆరు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1 తో చేజిక్కించుకున్నారు.  తొలి వన్డేలో వెస్టిండీస్‌ మహిళలు విజయం సాధించగా, రెండు, మూడు వన్డేల్లో భారత మహిళలలు గెలిచారు.

అంతక ముందు టాస్ గెలిచిన వెస్టిండిస్ మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. విండీస్‌ కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌(79) మరోసారి రాణించగా మిగతా వారు విఫలమయ్యారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో గోస్వామి, పూనమ్‌ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు సాధించగా, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్‌, దీప్తి శర్మలు తలో వికెట్‌ తీశారు. మూడు వికెట్లు రనౌట్ల రూపంలో రావడం విశేషం.               

గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమైన మంధాన.. రీఎంట్రీలోనే అదరగొట్టింది. 195 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టుకు ఓపెనర్లు  స్మృతి మంధాన(74; 63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా రోడ్రిగ్స్‌(69; 92 బంతుల్లో 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 141 పరుగులు జోడించారు. పూనమ్ రౌత్ (24;  49 బంతుల్లో 1ఫోర్);  కెప్టెన్ మిథాలి రాజ్ (20;  35 బంతుల్లో 2ఫోర్లు) లు రాణించడంతో 42.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. 

విరాట్ రికార్డ్ బ్రేక్...

ఈ మ్యాచ్ లో 63 బంతుల్లో 74 పరుగులు సాధించిన ఓపెనర్  స్మృతి మంధాన వన్డేల్లో రెండు వేల పరుగుల మార్కును చేరుకుంది. వేగవంతంగా రెండు వేల పరుగుల్ని సాధించిన రెండో భారత క్రికెటర్‌గా మంధాన ఘనత సాధించింది. కేవలం  51 ఇన్నింగ్స్‌ల్లోనే రెండు వేల పరుగుల మైలు రాయిని అందుకుంది. అందరి కంటే ముందు భారత పురుషుల జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ 48 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనత సాధించి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. 

భారత పురుఘల కెప్టెన్‌ కోహ్లి కంటే కూడా మంధాన రెండు వేల పరుగుల్ని ముందుగా సాధించడం ఇక్కడ విశేషం.  కోహ్లి 53వ ఇన్నింగ్స్‌లో 2వేల వన్డే పరుగుల్ని పూర్తి చేస్తే మంధాన 51 ఇన్నింగ్స్ లోనే చేరుకుంది. ఇక భారత మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ 52వ ఇన్నింగ్స్‌లో రెండు వేల పరుగుల మార్కును చేరారు.

మంధాన మెరుపులతో భారత మహిళల జట్టు విజయాన్ని సాధించడంతో ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ గా మంధాన ఎంపికైంది. సిరీస్ మొత్తం అద్భుతంగా రాణించిన వెస్టిండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్‌ కి ప్లేయర్ ఆప్ ది సిరీస్ అవార్డు లభించింది. 

Related image

 

బంతిపై ఉమ్మి వేయడంపై నిషేధం తాత్కాలికమే.. ఐసీసీ చీఫ్ అనిల్ కుంబ్లే వివరణ

బంతిపై ఉమ్మి వేయడంపై నిషేధం తాత్కాలికమే.. ఐసీసీ చీఫ్ అనిల్ కుంబ్లే వివరణ

   13 hours ago


కోహ్లీని జట్టులోంచి తీసేశారు.. ఇందుకా..!

కోహ్లీని జట్టులోంచి తీసేశారు.. ఇందుకా..!

   24-05-2020


వికెట్ కీపర్‌కు మారుపేరు ఇప్పటికీ ధోనీనే.. పక్కనపెడితే తీవ్ర నష్టం.. కైఫ్ ప్రశంసల వర్షం

వికెట్ కీపర్‌కు మారుపేరు ఇప్పటికీ ధోనీనే.. పక్కనపెడితే తీవ్ర నష్టం.. కైఫ్ ప్రశంసల వర్షం

   23-05-2020


ఐపీఎల్ పై ఆశలు.. బీసీసీఐ నిర్ణయం ఎలా వుంటుందో?

ఐపీఎల్ పై ఆశలు.. బీసీసీఐ నిర్ణయం ఎలా వుంటుందో?

   20-05-2020


వన్డేల్లో సచిన్ డబుల్ సెంచరీకి అంపైర్ భయమే కారణం..డేల్ స్టెయిన్ ఆరోపణ

వన్డేల్లో సచిన్ డబుల్ సెంచరీకి అంపైర్ భయమే కారణం..డేల్ స్టెయిన్ ఆరోపణ

   18-05-2020


సోషల్ మీడియాను ఊపేస్తున్న డేవిడ్ వార్నర్

సోషల్ మీడియాను ఊపేస్తున్న డేవిడ్ వార్నర్

   18-05-2020


కోహ్లీ బౌలింగ్.. అనుష్క బ్యాటింగ్ అదుర్స్

కోహ్లీ బౌలింగ్.. అనుష్క బ్యాటింగ్ అదుర్స్

   18-05-2020


కోవిడ్ 19 ఎఫెక్ట్... బంతికి మెరుపులు ఎలా?ఎంఎస్కే ఏమన్నారంటే?

కోవిడ్ 19 ఎఫెక్ట్... బంతికి మెరుపులు ఎలా?ఎంఎస్కే ఏమన్నారంటే?

   17-05-2020


భజ్జీ దొరికుంటే ఉతికేసేవాడిని.. తప్పించుకున్నాడు.. షోయబ్ సంచలన ప్రకటన

భజ్జీ దొరికుంటే ఉతికేసేవాడిని.. తప్పించుకున్నాడు.. షోయబ్ సంచలన ప్రకటన

   17-05-2020


భారత్ చేతిలోనే టెస్ట్ క్రికెట్ భవిష్యత్..ఛాపెల్ అంతరంగం

భారత్ చేతిలోనే టెస్ట్ క్రికెట్ భవిష్యత్..ఛాపెల్ అంతరంగం

   16-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle