facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
* తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ .. నామినేషన్లకు శ్రీకారం ..నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 25వ తేదీ* రక్షణమంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి సహా పలువురి నివాళి * ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ *మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి *సెన్సార్ బోర్డు పై వర్మ సీరియస్... కోర్టుకెళతానన్న ఆర్జీవీ*కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్

భారీ లక్ష్యం ....బోల్తాపడ్డ టీం ఇండియా

09-03-201909-03-2019 08:11:57 IST
2019-03-09T02:41:57.430Z09-03-2019 2019-03-09T02:38:55.421Z - - 18-03-2019

భారీ లక్ష్యం ....బోల్తాపడ్డ టీం ఇండియా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ వన్డేలో ఘన విజయం తర్వాత రాంచీలోనూ అదే జోరు సాగుతుందని భావించిన భారత క్రికెట్ అభిమానుల ఆశ నెరవేరలేదు. ఆస్ట్రేలియాతో రాంచీలో జరిగిన మూడో వన్డేలో టీమిండియా చివరి వరకూ పోరాడినా ఓటమి పాలైంది. 314 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా 48.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ప్రారంభించిన ప్రారంభంలోనే  27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది కోహ్లీ సేన.

కెప్టెన్ కోహ్లీ మరోమారు ఆదుకున్నా..ఫలితం లేకుండా పోయింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ చేసి జట్టును ఓ గాడిలో పెట్టినప్పటికీ సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో అతడి సెంచరీ వృథా అయిపోయింది.  చివర్లో కేదార్ జాదవ్ 26 పరుగులు విజయ్ శంకర్ 32 పరుగులు రవీంద్ర జడేజా 24 పరుగులు చేశారు. వారు కూడా ఆసీస్ బౌలర్లకు తలవంచక తప్పలేదు. మరో పది బంతులు మిగిలి ఉండగానే 281 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ 5 వన్డేల సిరీస్‌లో 2-1తో భారత్ ఆధిక్యాన్ని తగ్గించగలిగింది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle