newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భారత్ చేతిలోనే టెస్ట్ క్రికెట్ భవిష్యత్..ఛాపెల్ అంతరంగం

16-05-202016-05-2020 10:19:35 IST
Updated On 16-05-2020 10:28:37 ISTUpdated On 16-05-20202020-05-16T04:49:35.817Z16-05-2020 2020-05-16T04:49:32.085Z - 2020-05-16T04:58:37.557Z - 16-05-2020

భారత్ చేతిలోనే టెస్ట్ క్రికెట్ భవిష్యత్..ఛాపెల్ అంతరంగం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్​వద్దనుకుంటే టెస్ట్‌ ఫార్మాట్​అంతరించిపోయే స్థితికి చేరేలా ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్ అన్నాడు. కరోనా మహమ్మారితో టెస్ట్‌ క్రికెట్ ప్రమాదంలో పడిందన్నాడు. ప్లేవ్రైట్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ఫేస్​బుక్​లైవ్‌లో చాపెల్ టెస్టు క్రికెట్ భవితవ్యంపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. 

ఈ లైవ్లో ప్రముఖ కామెంటేటర్‌ చారు శర్మతోపాటూ ప్లేవ్రైట్‌ వ్యవస్థాపకులు వివేక్ ఆత్రేయ్‌ పాల్గొన్నారు. టెస్ట్‌ క్రికెట్‌ను పునరుద్ధరించడంలో భారత్​కీలకపాత్ర పోషిస్తుందని నమ్ముతున్నానని, భారత్ వద్దనుకుంటే టెస్ట్‌ క్రికెట్ అంతరించిపోయే ప్రమాదముందని చాపెల్ చెప్పాడు.

‘భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మాత్రమే టెస్ట్‌ క్రికెట్ ఆడేలా యువకులను ప్రోత్సహిస్తున్నాయి. మిగిలిన దేశాలేవీ అలా చేస్తున్నట్టు కనిపించడం లేదు. టీ20లకు నేను వ్యతిరేకం కాదు. ప్రజలకు ఆ ఫార్మాట్​ ద్వారా చేరువవడం సులభం. కాకపోతే టెస్ట్‌ క్రికెట్‌కు గడ్డు రోజులు వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అయితే టెస్ట్‌ ఫార్మాటే అత్యుత్తమ క్రికెట్ ​అని టీమ్​ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ చెప్పడంతో టెస్ట్‌ క్రికెట్ బతికే ఉంటుందన్న ఆశ కలిగింది’ అని గ్రెగ్ చాపెల్ అన్నాడు.

కాగా, భారత క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియన్ గ్రెగ్ చాపెల్ కోచ్‌గా పనిచేసిన రెండేళ్ల కాలం అత్యంత వివాదాస్పదం. జట్టు ప్రదర్శన సంగతి పక్కన పెడితే...ప్రతీ ఆటగాడు ఆ సమయంలో తీవ్ర అభద్రతా భావానికి లోనయ్యాడనేది నిర్వివాదాంశం. చాపెల్ ఎపిసోడ్‌పై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథలో అనేక అంశాలు వెల్లడించిన విషయం తెలిసిందే. చాపెల్ వ్యవహార శైలిపై ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ పుస్తకంలో ఆయనో రింగ్ మాస్టర్ అని సచిన్‌ విరుచుకు పడ్డాడు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle