newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భయం అందరికీ సహజం.. కోచ్ సాయం అప్పుడే అవసరం: ధోనీ

08-05-202008-05-2020 09:23:24 IST
Updated On 08-05-2020 10:11:30 ISTUpdated On 08-05-20202020-05-08T03:53:24.321Z08-05-2020 2020-05-08T03:53:22.533Z - 2020-05-08T04:41:30.621Z - 08-05-2020

భయం అందరికీ సహజం.. కోచ్ సాయం అప్పుడే అవసరం: ధోనీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మైదానంలోకి దిగాక మీరెంత ప్రశాంత మనస్కులైనా భయం అనే ఒత్తిడిని ఎదుర్కోక తప్పదని ప్రపంచ క్రికెట్‌లోనే మిస్టర్ కూల్‌గా పేరొందిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పష్టం చేశాడు.  అందులోనూ బ్యాటింగ్‌కు దిగిన సందర్భంలో తొలి 5-10 బంతులు ఎదుర్కొనే వరకు నా హృదయ స్పందన వేగంగా ఉంటుందనీ, అప్పుడు ఒత్తిడి మాత్రమే కాకుండా భయం కూడా వేస్తుంటుందని, అది చిన్న సమస్య అయినప్పటికీ కోచ్‌లకు చెప్పేందుకు వెనుకాడుతూ అక్కడే దెబ్బతింటుంటామని ధోనీ తన కూల్ నెస్ వెనక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టేశాడు.

మ్యాచ్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిగ్రహం కోల్పోకుండా ఎమ్ఎస్ ధోనీ చాలా సంయమనంతో వ్యవహరిస్తాడని పేరుంది. ఓటమి తప్పదని తేలుతున్న క్షణాల్లో కూడా ప్రత్యర్థి ఎత్తుకు ప్రశాంతంగా పై ఎత్తు వేసి చివరిక్షణంలో కూడా ఓటమినుంచి గెలుపుబాటకు జట్టును నడిపించడంలో ధోనీ అంత సక్సెస్ అయిన కెప్టెన్ సమకాలీన క్రికెట్ చరిత్రలో మరెవ్వరూ లేరని ప్రతీతి. ఇలాంటి ప్రఖ్యాతిని పొందిన ధోనీ సైతం మైదానంలో దిగిన తొలి క్షణాల్లో తనకు కూడా బాగా వేస్తుంటుందని చెప్పడం విశేషం.

తనకు లాగే, తోటి క్రికెటర్లలాగే భారతదేశంలో చాలా మంది క్రీడాకారులు ఒత్తిడితో పాటు మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ తెలిపాడు. కానీ వారంతా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నా కూడా అంగీకరించే పరిస్థితి మాత్రం లేదని అన్నాడు. మాజీ ఆటగాళ్లు ఎస్‌.బద్రీనాథ్‌, శరవణన్‌ కుమార్‌ ఆధ్వర్యంలోని ‘ఎంఫోర్‌’ అనే స్వచ్చంద సంస్థ.. కరోనాకు ముందు కోచ్‌లతో ఓ సమావేశం ఏర్పాటు చేసింది. దీంట్లో పాల్గొన్న ధోనీ.. మానసిక ఆరోగ్యంపై తన అభిప్రాయాలను వారితో పంచుకున్నాడు. ఆ సమావేశ వివరాలను ‘ఎంఫోర్‌’ సంస్థ గురువారం వెల్లడించింది. 

‘నిజానికి ఎవరూ తాము మానసిక బలహీనతతో బాధపడుతున్నామని అంగీకరించరు. ఇప్పుడదే పెద్ద సమస్య. నేను కూడా దీనికి అతీతుడనేమీ కాను. బ్యాటింగ్‌కు దిగిన సందర్భంలో తొలి 5-10 బంతులు ఎదుర్కొనే వరకు నా గుండె వేగం పెరుగుతుంది. అప్పుడు నాకు ఒత్తిడిగా అనిపించడంతో పాటు కాస్త భయం కూడా వేస్తుంది. ఎందుకంటే అందరికీ ఇదే అనుభవం ఎదురవుతుంది. మరి దాన్నెలా ఎదుర్కోవడం. వాస్తవానికిది చిన్న సమస్యే అయినప్పటికీ కోచ్‌లకు చెప్పేందుకు వెనుకాడతాం. అందుకే ఏ క్రీడల్లోనైనా ఆటగాళ్లకు, కోచ్‌లకు మధ్య సన్నిహిత సంబంధాలు కీలకం’ అని ధోనీ స్పష్టం చేశాడు.

అలాగే ప్రతీ క్రీడాకారుడికి మెంటల్‌ కండీషనింగ్‌ కోచ్‌ అవసరం చాలా ఉంటుందని ధోనీ గుర్తుచేశాడు. ‘మెంటల్‌ కండీషనింగ్‌ కోచ్‌ అంటే 15 రోజులకు ఒకసారి ఆటగాళ్లను కలిసి మాట్లాడేలా ఉండకూడదు. ఎందుకంటే అలా వస్తే కోచ్‌తో వారు అనుభవాలను మాత్రమే పంచుకోగలరు. ఒకవేళ అలా కాకుండా ఆటగాడితో నిరంతరం టచ్‌లో ఉంటే అతడు ఎక్కడ వెనకబడుతున్నాడనే విషయం కోచ్‌లకు స్పష్టంగా తెలుస్తుంది’ అని ధోనీ వివరించాడు. 

ఈ సందర్భంగా జట్టుతో ధోనీ సంబంధాలకు సంబంధించిన ఒక విశేషాన్ని ఆశిష్ నెహ్రా వెల్లడించాడు. జట్టు ఆటగాళ్లతో మాట్లాడేందుకు ఎంఎస్‌ ధోనీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని, అలాగే అతడి హోటల్‌ గదిలోకి ఎవరైనా వెళ్లే అవకాశం ఉందని మాజీ పేసర్‌ నెహ్రా తెలిపాడు. ‘చాలా మంది ధోనీ ఎక్కువగా మాట్లాడడని అనుకుంటారు. కానీ అది తప్పు. మ్యాచ్‌ అయిన తర్వాత రాత్రంతా అతడి రూమ్‌ తలుపులు తెరుచుకునే ఉంటాయి. ఆటగాళ్లు ఎప్పుడైనా క్రికెట్‌ గురించి మాట్లాడవచ్చు. తన ప్రణాళికల గురించి ప్రతీ ఆటగాడు తెలుసుకోవాలని ధోనీ భావిస్తాడు’ అని నెహ్రా చెప్పాడు.

 

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

   a day ago


IPL 2021: కింద మీద పడి  గెలిచిన రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   15-04-2021


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   15-04-2021


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15-04-2021


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   15-04-2021


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   15-04-2021


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   15-04-2021


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   15-04-2021


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle