newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భజ్జీ దొరికుంటే ఉతికేసేవాడిని.. తప్పించుకున్నాడు.. షోయబ్ సంచలన ప్రకటన

17-05-202017-05-2020 09:17:06 IST
Updated On 17-05-2020 09:41:11 ISTUpdated On 17-05-20202020-05-17T03:47:06.918Z17-05-2020 2020-05-17T03:47:04.367Z - 2020-05-17T04:11:11.585Z - 17-05-2020

భజ్జీ దొరికుంటే ఉతికేసేవాడిని.. తప్పించుకున్నాడు.. షోయబ్ సంచలన ప్రకటన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దాయాది దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు ఇప్పుడు అంతంత మాత్రమే కానీ ఇరుదేశాలకు చెందిన కొందరు క్రికెటర్లు గొప్ప స్నేహబంధం నిలుపుకుంటున్నారు. కానీ అలాంటి స్నేహబంధాన్ని కూడా మైదానంలో తలపడినప్పుడు విడిచిపెట్టి దేశం కోసం జట్టుకోసం పోరాడటం చాలా సందర్భాల్లో కనబడుతుంది. భారత, పాక్ అత్యుత్తమ క్రికెటర్లు హర్బజన్, షోయబ్ అక్తర్ మధ్య కూడా అలాంటి జగడం జరిగి తర్వాత చల్లారిపోయింది.

సరిగ్గా పదేళ్ల క్రితం 2010 మార్చిలో శ్రీలంక వేదికగా ఆసియాకప్‌ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడింది. హోరాహోరీగా జరిగిన ఈ ఫైనల్లో టీమిండియా ఆఖరి ఓవర్లో 2 బంతుల్లో మూడు పరుగులు చేయాల్సి ఉంది. అప్పటికే క్రీజులో హర్భజన్‌, ప్రవీణ్‌ కుమార్‌లు ఉన్నారు. మహ్మద్‌ ఆమిర్‌ వేసిన ఐదో బంతిని భజ్జీ సిక్స్‌గా మలచి జట్టును గెలిపించాడు. అంతే భజ్జీ ఒక్కసారిగా గట్టిగట్టిగా అరుస్తూ నాన్‌ స్ర్టైకింగ్‌లో ఉన్న ప్రవీణ్‌ కుమార్‌ను గట్టిగా హత్తుకున్నాడు. 

అయితే మ్యాచ్‌లో 47వ ఓవర్‌ పాక్‌ స్పీడ్‌స్టర్ షోయబ్‌ అక్తర్‌ వేశాడు. ఆ ఓవర్‌లో హర్భజన్‌ మొదటి బంతినే సిక్స్‌గా మలచడంతో అక్తర్‌ కోపంతో మిగతా బంతులన్నీ భజ్జీ భుజాన్ని టార్గట్‌ చేస్తూ పదునైన బౌన్సర్లు సంధించాడు. అంతేగాక అక్తర్‌, భజ్జీల మధ్య మ్యాచ్‌ చివరి వరకు మాటల యుద్దం కూడా నడిచింది. ఆ కోపమే భజ్జీని ఆమిర్‌ ఓవర్లో సిక్స్‌ కొట్టి భారత్‌ను కప్‌ అందుకునేలా చేసింది. ఇది క్లుప్తంగా అక్కడ జరిగిన సన్నివేశం.

తాజాగా దీనిపై షోయబ్‌ అక్తర్‌ హలో యాప్‌కు ఇంటర్య్వూ ఇస్తూ మరోసారి నవ్వుతూ స్పందించాడు. ''ఆరోజు మ్యాచ్‌ ముగియగానే హర్భజన్‌ ఉన్న హోటల్‌ రూంకు వెళ్లి అతన్ని కొట్టాలనుకున్నా. స్వతహగా మంచివాడైన భజ్జీ పాక్‌కు వచ్చినప్పుడు మాతో పాటు లాహోర్‌ మొత్తం కలియ తిరిగాడు. ఎన్నో సార్లు మాతో కలిసి భోజనం కూడా చేశాడు. 

అలాంటి పంజాబీ బ్రదర్‌ నాతో ఎలా మిస్‌బిహేవ్‌ చేశాడనే కోపం వచ్చింది. దీంతో అతని రూంకెళ్లి కొట్టాలనుకున్న.. కానీ నేను వస్తున్నట్లు ముందే తెలుసుకున్న భజ్జీ అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎంత వెతికినా కనిపించలేదు. మరుసటి రోజు నన్ను కలిశాడు. ఇద్దరం క్షమాపణలు కూడా చెప్పుకున్నాం' అంటూ పేర్కొన్నాడు. 

ఇదే విషయమై హర్భజన్‌ కూడా గతంలో పలుమార్లు వివరించాడు.

అయితే ఆ ఘటన జరిగినప్పటికీ ఆ ఇద్దరు గొప్ప క్రికెటర్ల మధ్య స్నేహ బంధాన్ని దెబ్బతీయలేకపోయింది. హర్భజన్, షోయబ్ క్రికెట్ ఫీల్డ్‍‌లో గొప్ప స్నేహితుల్లాగా మిగిలిపోయారు. అనేక టీవీ షోల్లో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. హర్బజన్ కూడా గత సంవత్సరం షోయబ్ అక్తర్‌ని తన యూట్యూబ్ చానల్‌కి ఆహ్వానించిన విషయం తెలిసిందే.

IPL 2021: కింద మీద పడి  గెలిచిన  రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   8 hours ago


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   10 hours ago


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15 hours ago


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   16 hours ago


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   14 hours ago


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   19 hours ago


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   a day ago


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle