బ్యాడ్మింటన్‌కు కరోనా వైరస్ దెబ్బ.. టోర్నమెంట్ రద్దు
18-06-202018-06-2020 12:53:50 IST
Updated On 18-06-2020 18:57:20 ISTUpdated On 18-06-20202020-06-18T07:23:50.887Z18-06-2020 2020-06-18T07:23:42.703Z - 2020-06-18T13:27:20.154Z - 18-06-2020

క్రీడాకారుల పాలిట శాపంగా మారింది కరోనా మహమ్మారి. ఒకవైపు వరల్డ్ టీ 20 క్రికెట్ టోర్నమెంట్ రద్దయిన సంగతి తెలిసిందే. క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఈ ఏడాది సెప్టెంబరులో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా మరో క్రీడాపోటీకి మంగళం పాడేసింది కరోనా. ఆగస్టులో జరగాల్సిన హైదరాబాద్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను రద్దుచేశారు. సవరించిన క్యాలెండర్ ఆవిష్కరించిన కొద్ది రోజుల తరువాత, కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని క్రీడా ప్రపంచ పాలక మండలి దీనిని రద్దు చేసింది. వాస్తవానికి ఈ టోర్నమెంట్ ఆగస్టు 11 నుండి 16 వరకు జరగాలి. ఇంతక ముందు కరోనా మహమ్మారి కారణంగా అనేక క్రీడలు వాయిదా పడ్డాయి. అయితే అప్పుడు వాయిదా వేసిన క్రీడలు పునః ప్రారంభించడానికి మే 22 న బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బిడబ్ల్యుఎఫ్) ప్రకటించిన క్యాలెండర్లో భారతదేశంలో జరగబోయే మూడు టోర్నమెంట్ లో హైదరాబాద్ ఓపెన్ కూడా ఉంది. అయితే ఇప్పుడు హైదరాబాద్ ఉన్న పరిస్థితుల కారణంగా బిడబ్ల్యుఎఫ్ మరియు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఓపెన్ 2020 ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించడం, క్రీడాకారులను రిస్క్ లో పడేయడమే అవుతుందని, లాక్ డౌన్ లో ఉన్నందున ఆగస్టులో జరిగే టోర్నమెంట్‌కు నిర్వహించడం చాలా కష్టమయ్యేదని జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ అంగీకరించారు. ప్రపంచ ఆరోగ్య సంక్షోభం దృష్ట్యా ఆస్ట్రేలియా ఓపెన్ మరియు కొరియా మాస్టర్స్ అనే మరో రెండు టోర్నమెంట్లను కూడా బిడబ్ల్యుఎఫ్ రద్దు చేసింది. ఇప్పుడు బ్యాడ్మింటన్ కూడా వాటికి తోడయింది.

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
3 hours ago

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
5 hours ago

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
13-04-2021

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
12-04-2021

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను
12-04-2021

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!
12-04-2021

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
11-04-2021

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
11-04-2021

IPL 2021: అతడే మా తురుపుముక్క.. హర్షల్‌పై కోహ్లీ ప్రశంసలు
11-04-2021

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
10-04-2021
ఇంకా