newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బ్యాట్స్ మెన్ రాహుల్ చేసిన పనికి అంతా ఫిదా!

21-04-202021-04-2020 09:07:13 IST
Updated On 21-04-2020 09:27:34 ISTUpdated On 21-04-20202020-04-21T03:37:13.073Z21-04-2020 2020-04-21T03:36:49.240Z - 2020-04-21T03:57:34.291Z - 21-04-2020

బ్యాట్స్ మెన్ రాహుల్ చేసిన పనికి అంతా ఫిదా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. అన్ని వర్గాల ప్రజలు ఈ వైరస్ ప్రభావానికి లోనవుతున్నారు. సినీ తారలు, క్రీడాకారులు తమవంతు సాయం చేస్తున్నారు. సినీకార్మికుల కుటుంబాలను ఆదుకుంటున్నారు. క్రికెటర్లు కూడా భారీ ఎత్తున విరాళాలు అందిస్తూ కరోనా మహమ్మారి పై పోరాటానికి మేము సైతం అంటున్నారు. తాజాగా ఇండియన్‌ క్లాసిక్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 

గత ఏడాది ప్రపంచకప్‌ సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను వేలం వేయనున్నాడు. బ్యాట్‌ను వేలంవేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని బలహీనమైన పిల్లల కోసం ఉపయోగించే నిధికి అందజేయనున్నాడు. పుట్టినరోజు సందర్భంగా ఈ మేరకు ట్విటర్‌లో వీడియో పోస్టు చేశాడు. బ్యాట్‌తోపాటు ఇతర జ్ఞాపికలను వేలం వేయడం ద్వారా వచ్చిన మొత్తం అవేర్‌ ఫౌండేషన్‌కు వెళ్తుందని, ఇది భారతదేశంలోని అనాథ, బలహీన పిల్లలకు విద్యను అందించేందుకు ఉపయోగిస్తారని తెలిపాడు. 

క్రికెట్‌ ప్యాడ్స్‌, గ్లోవ్స్‌, హెల్మెట్స్‌, తన జెర్సీలను నిధుల కోసం విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు రాహుల్‌ తెలిపాడు. వీటిన తన సహకార భాగస్వామి భారత్‌ ఆర్మీకి అందజేయనున్నట్టు తెలిపాడు. సోమవారం నుంచి మొదలైన వేలంలో రాహుల్‌ సంతకం చేసిన 2019 ప్రపంచ కప్‌ బ్యాట్‌, టెస్ట్‌, వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో ధరించిన జెర్సీలు సిద్ధంగా ఉంచారు. తనపై, పిల్లలపై కొంత ప్రేమను చూపించాలని రాహుల్‌ కోరాడు. ఈ కష్ట సమయాన్ని అధిగమించి మన మంతా క్షేమంగా బయటకు వస్తామని రాహుల్‌ తెలిపాడు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అంతా భౌతిక దూరం పాటించాలని, లాక్ డౌన్ నిబంధనలు తు.చ తప్పకుండా అనుసరించాలని రాహుల్ కోరాడు. 

కరోనా బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ కరోనా బాధితుల సహాయానికి నడుం బిగించాడు. 2019 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తాను ధరించిన టీషర్ట్‌ను వేలం వేశాడు బట్లర్. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని లండన్‌లోని రెండు ఆస్పత్రుల్లో చికిత్స అందుకుంటున్న కరోనా బాధితులకు అందిస్తానని చెప్పాడు. ఈమేరకు ట్విటర్‌లో పోస్టు చేసిన వీడియో ఎంతోమందికి ఇన్ స్పిరేషన్ గా మారిన సంగతి తెలిసిందే. 

కోవిడ్ 19 కోసం టీషర్ట్ వేలం వేసిన స్టార్ క్రికెటర్

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

   a day ago


IPL 2021: కింద మీద పడి  గెలిచిన రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   15-04-2021


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   15-04-2021


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15-04-2021


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   15-04-2021


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   15-04-2021


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   15-04-2021


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   15-04-2021


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle