newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బౌలర్ల ఆధిపత్యంతో ఆసక్తికరంగా సాగుతున్న రెండో టెస్ట్...

04-01-202004-01-2020 08:17:38 IST
2020-01-04T02:47:38.950Z04-01-2020 2020-01-04T02:47:34.370Z - - 14-04-2021

బౌలర్ల ఆధిపత్యంతో ఆసక్తికరంగా సాగుతున్న రెండో టెస్ట్...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సౌత్ ఆఫ్రికా బౌలర్లు తమ ఆధిపత్యం ప్రదర్శించడంతో కేప్ టౌన్ లో జరుగుతున్న రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టును ప్రోటీస్ బౌలర్లు ఫిలాండర్, రబడా ముప్పు తిప్పలు పెట్టారు. వీరి బౌలింగ్ ధాటికి ఇంగ్లాండ్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. ఆట ముగిసే సమయానికి 56 పరుగులతో పోప్, ఆండర్సన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 3వ ఓవర్ లోనే జాక్(4) ఫిలాండర్ బౌలింగ్ లో కీపర్ డీకాక్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ దశలో ఫస్ట్ డౌన్ లో వచ్చిన డెన్లీతో కలిసి ఓపెనర్ డొమినిక్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ క్రీజులో నిలదొక్కుకోవడంతో ఇంగ్లాండ్ జట్టు కోలుకుంది. రెండో వికెట్ కు 55 పరుగులు జోడించిన తరువాత డొమినిక్(34)ని రబడా బోల్తా కొట్టించాడు.

డెన్లీతో జత కలిసిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ రూట్ స్ట్రోక్ ప్లేతో అలరించాడు. జట్టు స్కోరు 105 పరుగుల వద్ద రూట్(35) పరుగులు చేసి ఔట్ కావడంతో ఇంగ్లాండ్ జట్టు కష్టాల్లో పడింది. ఆ వెంటనే డెన్లీ(38)ని మహారాజా క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో స్ట్రోక్స్-పోప్ జోడి జట్టును ఆదుకున్నారు. 

రిస్క్ తీసుకోకుండా ఈ జోడి సమర్థవంతంగా సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ను ఎదురుకున్నారు. పోప్ నిదానంగా ఆడినా స్ట్రోక్స్ భారీ షాట్లతో ఎదురుదాడి చేశాడు. 5వ వికెట్ కు 58 పరుగులు జోడించిన తరువాత స్ట్రోక్స్(47) ఔట్ కావడంతో ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ తరువాత వచ్చిన బట్లర్ వన్డే తరహాలో కేవలం 27 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 29 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ జట్టు 221/5 స్కోరు వద్ద నిలిచింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు చేయడం ఖాయంగా కనబడింది.

ఈ దశలో విజృంభించిన సౌత్ ఆఫ్రికా బౌలర్లు వరుసగా వికెట్లు తీశారు. బట్లర్(29),  సామ్ కరణ్(9), బేస్(0), బ్రాడ్(1) వరుసగా పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ జట్టు 234 పరుగులకే 9 వికెట్లు నష్టపోయింది. కానీ చివరి బాట్స్మెన్ ఆండర్సన్(3) సహకారంతో పోప్ ఇంగ్లాండ్ జట్టు స్కోరును 262 పరుగులకు చేర్చాడు. ఈ క్రమంలో పోప్ హాఫ్ సెంచరీ చేశాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఫిలాండర్, రబడా, ప్రీటోరియస్, నోర్తుజే చెరో రెండు వికెట్లు తీయగా మహారాజ్ ఒక వికెట్ తీశారు. 

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle