బెన్‌స్టోక్స్‌కి ఊహించని ఎదురుదెబ్బ
14-07-202014-07-2020 13:20:28 IST
Updated On 14-07-2020 16:47:09 ISTUpdated On 14-07-20202020-07-14T07:50:28.962Z14-07-2020 2020-07-14T07:36:29.373Z - 2020-07-14T11:17:09.571Z - 14-07-2020

వెస్టిండీస్‌తో సౌథాంప్టన్ వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్టులో కెప్టెన్‌గా ఇంగ్లాండ్ టీమ్‌ని నడిపించిన బెన్‌స్టోక్స్‌కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ జో రూట్ తన భార్య ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండాలని ఆశించి.. తొలి టెస్టుకి దూరమవగా.. బెన్ స్టాక్స్ చేతికి తొలిసారి ఇంగ్లాండ్ టీమ్ పగ్గాలు వెళ్లాయి. కానీ.. సౌథాంప్టన్ టెస్టులో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ టీమ్‌ని ఓడించిన వెస్టిండీస్.. మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్‌కి కూడా సౌథాంప్టన్ టెస్టులో మంచి మార్కులు పడలేదు. టాస్ నుంచి జట్టు ఎంపిక వరకూ అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. వర్షం పడే సూచనలు కనిపిస్తున్నా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం, తుది జట్టు నుంచి సీనియర్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌ని తప్పించడం.. ఇంగ్లాండ్ టీమ్ ఓటమికి కారణాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ప్లేయర్‌గానూ బెన్‌స్టోక్స్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 43, 46 పరుగులు చేసి.. 4, 2 వికెట్లతో సరిపెట్టాడు. మ్యాచ్‌లో ఆఖరి రోజు స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన బెన్‌స్టోక్స్.. బ్లాక్‌వుడ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ని నేలపాలు చేశాడు. దాంతో.. అతనే ఆఖరి వరకూ క్రీజులో నిలిచి విండీస్‌ని గెలిపించాడు.సౌథాంప్టన్ టెస్టులో కెప్టెన్సీ మీ ఆటపై ప్రభావం చూపిందా..? అని బెన్‌స్టోక్స్‌ని ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు. ‘‘నేను కెప్టెన్సీని బాగా ఎంజాయ్ చేశాను. వాస్తవానికి గత కొంతకాలంగా కెప్టెన్సీపై నేను అవగాహన పెంచుకున్నా. దాంతో.. అవకాశం కోసం ఎదురుచూశా. మైదానంలో ఒక కెప్టెన్‌గా సౌథాంప్టన్ టెస్టులో తీసుకున్న నిర్ణయాల్ని నేను బాగా ఆస్వాదించా. కెప్టెన్సీ నా ఆటపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఒక ప్లేయర్‌గా మునుపటి తరహాలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నించా’’ అని బెన్‌స్టోక్స్ వెల్లడించాడు.

పడిక్కల్, కోహ్లీ చితక్కొట్టుడు.. రాజస్థాన్ కుదేలు
4 hours ago

RCBvsRR: బెంగళూరు వరుస విజయాలకు రాజస్థాన్ బ్రేక్ వెయ్యగలదా?
19 hours ago

చెన్నై సూపర్ కింగ్స్ ను టెన్షన్ పెట్టగా.. చివరికి..!
22-04-2021

CSK vs KKR: ధోని కెప్టెన్సీ ముందు KKR నిలిచేనా?
21-04-2021

SRH లక్ష్యం 120 ఛేదించేనా తడబడేనా?
21-04-2021

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్..
21-04-2021

ధోని తల్లిదండ్రులకు కరోనా..!
21-04-2021

రోహిత్ శర్మకు భారీ జరిమానా..!
21-04-2021

DC vs MI: ముంబై బౌలింగ్ ధాటికి.. ఢిల్లీ బ్యాటమెన్ నిలవగలరా..!
20-04-2021

రాజస్థాన్ ను చిత్తు చేసిన చెన్నై
20-04-2021
ఇంకా