newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బుమ్రా మూడు ఫార్మట్లలో ఎక్కువకాలం ఆడలేడు.. షోయబ్ అక్తర్ జోస్యం

12-08-202012-08-2020 07:16:28 IST
2020-08-12T01:46:28.469Z12-08-2020 2020-08-12T01:46:23.950Z - - 11-04-2021

బుమ్రా మూడు ఫార్మట్లలో ఎక్కువకాలం ఆడలేడు.. షోయబ్ అక్తర్ జోస్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సుదీర్ఘ కాలం మూడు ఫార్మాట్లు ఆడలేడని గతంలోనే చెప్పిన పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ మళ్లీ అదే వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ అతనికే చేటు చేస్తుందని ముందే ఊహించానని, కొంత కాలానికి తాను చెప్పిందే నిజమైందని అక్తర్‌ తాజాగా పేర్కొన్నాడు. 

‘టెస్టు మ్యాచ్‌లో బుమ్రా ధైర్యం, సత్తా ఏమిటో చూశాం. బుమ్రాది చాలా కష్టించే తత్వం. క్రికెట్‌ బౌలింగ్‌పై ఎక్కవ దృష్టి పెడతాడు. ఫిట్‌నెస్ విషయంలో అతను ఎక్కడికి  వెళుతున్నాడో బుమ్రాకు తెలుసు. ప్రస్తుతం నేను అడిగే ప్రశ్న ఒక్కటే. బుమ్రాకు అతని వెన్నుపూస​ నుంచి పూర్తి సహకారం అందుతుందా?

బుమ్రా యాక్షన్‌ అతనికే చేటు చేస్తుంది. అతడి వెన్ను గాయం బారిన పడటానికి యాక్షనే కారణం. బుమ్రా సుదీర్ఘ కాలం మూడు ఫార్మాట్లలో ఆడలేడనే విషయం కచ్చితంగా చెబుతా. బుమ్రా వెన్ను గాయం బారిన పడకముందే అతని మ్యాచ్‌లు ఎక్కువగా చూసేవాడిని. 

ఆ క్రమంలోనే వెన్నుగాయం ప్రమాదం బుమ్రాకు పొంచి ఉందని ఫ్రెండ్స్‌కు చెప్పేవాడిని. అదే జరిగింది. ఇప్పుడు కూడా బుమ్రా ఎక్కువ కాలం మూడు ఫార్మాట్లకు న్యాయం చేయలేడని చెబుతున్నా’ అని ఆకాశ్‌ వాణి కార్యక్రమంలో ఆకాశ్‌ చోప్రాతో మాట్లాడుతూ బుమ్రా గురించి అక్తర్‌ స్పందించాడు.

ఆధునిక క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా అచిరకాలంలోనే వృద్ధిలోకి వచ్చిన టీమిండియా పేస్ బౌలర్ బుమ్రా 2018-19లో టెస్టు సీరీస్‌లో ఆస్ట్రేలియాపై మొట్టమొదటి సారిగా భారత్ గెలుపు సాధించిన సీరీస్‌లో ఆద్యంతం బుమ్రా ప్రతిభ ప్రదర్శించాడు. అయితే తర్వాత జరిగిన దక్షిణాఫ్రికా సీరీస్‌లో వెన్నెముక గాయంతో ఇబ్బంది పడ్డాడు.

టెస్టుల్లో ఇంతవరకు 68 వికెట్లు పడగొట్టిన బుమ్రా వన్డేల్లో 104, టి20ల్లో 59 వికెట్లు సాధించి టీమిండియాలో తిరుగులేని స్థానం సంపాదించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బ్యాట్స్‌మన్లు పరుగులు తీయకుండా నిరోధించి వికెట్లు పడగొట్టి జట్టుకు విజయం సాధించిపెట్టడంలో బుమ్రా ఆరితేరిపోయాడు. 

ఈ ప్రతిభే తనకు ప్రపంచంలోనే ప్రమాదకమైన డెత్ ఓవర్స్ స్పెషలిస్టుగా గుర్తింపు తీసుకొచ్చింది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle