newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

బీసీసీఐ రూల్స్ బ్రేక్.. తాంబేకి ఐపీఎల్ ఆడే ఛాన్స్ మిస్!

13-01-202013-01-2020 17:31:56 IST
2020-01-13T12:01:56.833Z13-01-2020 2020-01-13T12:01:55.131Z - - 18-01-2020

బీసీసీఐ రూల్స్ బ్రేక్.. తాంబేకి ఐపీఎల్ ఆడే ఛాన్స్ మిస్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రికెటర్లకు బీసీసీఐ నిబంధనలు షాకిస్తున్నాయనే చెప్పాలి. బీసీసీఐ తాజా నిబంధనలను అధికారి ఒకరు క్రికెటర్లకు పంపించారు. ‘‘విదేశీ లీగ్‌లు ఆడాలనుకునే భారత క్రికెటర్లు తెలుసుకోవాలి.  ఐపీఎల్‌ ఆడాలనుకుంటే విదేశీ లీగ్‌ల్లో ఆడకూడదు. ఒకవేళ  విదేశీ లీగ్‌లపై ఆసక్తి ఉంటే ఐపీఎల్‌ను వదులుకోవాలి’’ అని నిబంధనల్లో ఉంది.

అయితే ఈ సంగతి తెలియని ప్రవీణ్‌ తాంబే అబుదాబిలో జరిగిన టీ10 లీగ్‌లో భాగంగా ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లో తాంబే తన పేరును పంపాడు. అదే సమయంలో ఐపీఎల్‌ వేలానికి కూడా వచ్చాడు. ఇది బీసీసీఐ ప్రొటోకాల్‌ను వ్యతిరేకించడమేనని బీసీసీఐ షాకిచ్చింది. 

2020లో జరగబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కోసం జరిగిన వేలంలో ముంబైకి చెందిన 48 ఏళ్ల వెటరన్‌ ఆటగాడు ప్రవీణ్‌ తాంబేను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వేలంలో స్వంతం చేసుకుంది.  అతను కేవలం రూ. 20లక్షలకే అమ్ముడయ్యాడు. తాంబే కోసం ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడంతో చివరకు కేకేఆర్‌ బిడ్‌కు వెళ్లింది. అక్కడ మిగతా ఫ్రాంచైజీల నుంచి ఎటువంటి పోటీ లేకపోవడంతో తక్కువ ధరకే తాంబే కేకేఆర్‌ సొంతమయిన సంగతి తెలిసిందే. తాజా పరిస్థితులు, బీసీసీఐ నిబంధనల నేపత్యంలో తాంబే ఐపీఎల్‌ ఆడటానికి అర్హత కోల్పోయాడు.

ఒకవేళ ఆడాలనుకుంటే బీసీసీఐ నుంచి ఎన్‌ఓసీ తీసుకున్న తర్వాతే వేరే విదేశీ లీగ్‌లు ఆడాలి. తాంబే బ్రేక్‌ చేయడంతో ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. 2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన తాంబే.. మొత్తంగా 33 మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు తీశాడు. తాజాగా ఐపీఎల్‌లో ఆడే అవకాశం కోల్పోవడంపై తాంబే ఏమంటాడో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle