newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బీసీసీఐ ప్యానెల్ నుంచి మంజ్రేకర్ ఉద్వాసన.. సీఎస్‌కే ట్రోల్

15-03-202015-03-2020 11:47:55 IST
2020-03-15T06:17:55.286Z15-03-2020 2020-03-15T06:17:52.552Z - - 22-04-2021

బీసీసీఐ ప్యానెల్ నుంచి మంజ్రేకర్ ఉద్వాసన.. సీఎస్‌కే ట్రోల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత మాజీ క్రికెటర్‌, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ బీసీసీఐ ప్యానల్‌ నుంచి ఉద్వాసన గురయ్యాడనే వార్తలకు మరింత బలం చేకూరింది. మంజ్రేకర్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) చేసిన  తాజా ట్వీట్‌ అందుకు ఉదాహరణగా నిలిచింది. ‘నీ బిట్స్‌ అండ్‌ పీసెస్‌ ఆడియో ఫీడ్‌ వినాల్సిన అవసరం లేదు’ అంటూ ఐపీఎల్‌ ఫ్రాంచైజీల్లో ఒకటైన సీఎస్‌కే తన ట్వీటర్‌ అకౌంట్‌లో పేర్కొనడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇది కచ్చితంగా మంజ్రేకర్‌ను టార్గెట్‌ చేస్తూ చేసిన ట్వీట్‌ అనేది సగటు క్రికెట్‌ అభిమానికి ఇట్టే అర్థమవుతుంది. 

ఎందుకంటే గతంలో టీమిండియా ఆల్‌ రౌండర్‌, సీఎస్‌కే ఆటగాడైన రవీంద్ర జడేజాపై మంజ్రేకర్‌ ఇదే తరహా కామెంట్‌ చేసిన తరుణంలో అందుకు ఇప్పుడు అదే వ్యాఖ్యను సీఎస్‌కే జోడించింది. గతేడాది జరిగిన వరల్డ్‌కప్‌ సందర్భంగా టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై మంజ్రేకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ' రవీంద్ర జడేజా లాంటి బిట్స్‌ అండ్‌ పీసెస్‌ ఆటగాళ్లకు తాను ఫ్యాన్‌ కాదని, జడేజా టెస్టు క్రికెటర్‌ మాత్రమేనని, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అతడు అన్‌ఫిట్‌ అంటూ' అంటూ పేర్కొన్నాడు. 

దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీనికి జడేజా కూడా ధీటుగానే బదులిచ్చాడు. నీకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఘనత తనదని, ఇంకా ఆడుతూనే ఉన్నానని జడేజా ఘాటుగా బదులిచ్చాడు. కాగా, ఇలా మంజ్రేకర్‌ తన వ్యాఖ్యానంతో జడేజానే కాకుండా చాలా మందిపై విమర్శలు చేశాడు. ఇటీవల సహచర కామెంటేటర్‌ హర్షా భోగ్లేపై కూడా విమర్శలు చేశాడు. 

పింక్‌ బాల్‌ అంశానికి సంబంధించి ఆ బంతితో కచ్చితత్వం ఎలా ఉందో ఆటగాళ్లను అడిగి తెలుసుకోవాలని భోగ్లే సూచించగా,  క్రికెట్‌ గురించి బాగా తెలిసిన నువ్వు అడిగితేనే బాగుంటుందని మంజ్రేకర్‌ ఎద్దేవా చేశాడు. అంటే హర్షా భోగ్లే క్రికెట్‌ ఆడకుండా కామెంటేటర్‌ కావడాన్ని మంజ్రేకర్‌ వేలెత్తి చూపాడు. 

ఇలా మంజ్రేకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు పాలు కావడం తరచు జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే మంజ్రేకర్‌ను బీసీసీఐ ప్యానల్‌ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే వర్షార్పణమైన భారత్‌-దక్షిణాఫ్రికాల తొలి వన్డేకు మంజ్రేకర్‌ రాలేదనేది సమాచారం.

జడేజానే కాకుండా గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని కూడా సంజయ్ మంజ్రేకర్ దెప్పిపొడిచిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్‌లో 87 బంతులకు 41 పరుగులు తీయడం, వామప్ మ్యాచ్‌లో 56 బంతులకు 69 పరుగులు తీయడం చూస్తుంటే పెద్ద పెద్ద గేమ్స్‌లో ధోనీ లయ కోల్పోయినట్లే తెలుస్తోందని మంజ్రేకర్ వ్యాఖ్యానించి సీఎస్కే అభిమానుల ఆగ్రహాన్ని చవిచూశాడు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle