newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బీజేపీలోకి బ్యాడ్మింటన్ స్టార్ సైనా

29-01-202029-01-2020 13:02:12 IST
2020-01-29T07:32:12.215Z29-01-2020 2020-01-29T07:32:10.577Z - - 20-04-2021

బీజేపీలోకి బ్యాడ్మింటన్ స్టార్ సైనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు రాజకీయాల బాట పడుతున్నారు. గౌతమ్ గంభీర్ బీజేపీలో చేరి ఎంపీ అయిపోయాడు. తాజాగా భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బీజేపీలో చేరనుంది. ఇప్పటిదాకా బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సైనా ఇక నుంచి రాజకీయాల్లో తనదైన ముద్రవేయనున్నారు. గతంలో అనేక సార్లు సైనా నెహ్వాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసింది.

ఆమె సాధించిన విజయాలకు మోడీ కూడా అభినందనలు తెలిపారు. తాజాగా ఆమె బీజేపీలోకి రావాలని నిర్ణయించడంపై ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘనంగా స్వాగతం పలికారు.

అరుణ్ సింగ్ సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె సోదరి చంద్రాన్షు కూడా బీజేపీలో చేరారు. హర్యానాలో పుట్టిన నెహ్వాల్ హైదరాబాద్‌లో పెరిగారు. పుల్లెల గోపీచంద్ దగ్గర బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందారు. 2015లో వరల్డ్ నంబర్ 1 మహిళా షట్లర్‌గా ఆమె ఎదిగారు. 2018లో ఆమె తెలుగు షట్లర్ పారుపల్లి కశ్యప్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. సైనా బాటలో ఇంకెంతమంది రాజకీయాల్లోకి వస్తారో చూడాలి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle