newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బిల్లింగ్స్ సెంచరీ వృధా.. మొదటి వన్డే ఆసీస్ దే..!

12-09-202012-09-2020 11:28:35 IST
2020-09-12T05:58:35.342Z12-09-2020 2020-09-12T05:58:31.410Z - - 12-04-2021

బిల్లింగ్స్ సెంచరీ వృధా.. మొదటి వన్డే ఆసీస్ దే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో ఆస్ట్రేలియా 19 పరుగులతో విజయాన్ని సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేయగా.. ఛేజింగ్ లో ఇంగ్లాండ్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 275 పరుగులు మాత్రమే చేయగలిగింది. శామ్ బిల్లింగ్స్ 110 బంతుల్లో 118 పరుగులు చేసినప్పటికీ ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించలేకపోయాడు.

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టుకు నాలుగో ఓవర్ లోనే జొఫ్రా ఆర్చర్ షాక్ ఇచ్చాడు. వార్నర్ ఆరు పరుగులకే పెవిలియన్ చేరాడు. తర్వాత వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చింది ఆస్ట్రేలియా. 123 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. మిచెల్ మార్ష్, మ్యాక్స్ వెల్ భాగస్వామ్యం ఆస్ట్రేలియాను గాడిన పెట్టింది. మ్యాక్స్ వెల్ 59 బంతుల్లోనే 77 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మిచెల్ మార్ష్ 73 పరుగులు చేయి అవుట్ అయ్యాడు. చివర్లో స్టార్క్ 12 బంతుల్లో 19 పరుగులు బాదడంతో  ఆస్ట్రేలియా 294 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్ జట్టు కూడా ఛేజింగ్ లో వరుసగా వికెట్లను కోల్పోయింది. రాయ్ మూడు పరుగులకే అవుట్ అవ్వగా, వన్ డౌన్ వచ్చిన రూట్ కేవలం 1 పరుగుకే అవుట్ అయ్యాడు. మోర్గాన్ వేగంగా పరుగులు చేసే క్రమంలో 23 పరుగులకు వెనుదిరిగాడు. ఆ తర్వాత అద్భుతమైన ఫామ్ లో ఉన్న బట్లర్ నాలుగు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరగడంతో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది.

కనీసం పోరాడకుండా చేతులెత్తేస్తున్న సమయంలో ఓపెనర్ బెయిర్ స్టో కు శామ్ బిల్లింగ్స్ తోడయ్యాడు. వీరిద్దరూ మంచి పార్ట్నర్ షిప్ నమోదు చేశారు. 84 పరుగులు చేసిన బెయిర్ స్టో అవుట్ అయ్యాక శామ్ బిల్లింగ్స్ కు అండగా నిలిచే బ్యాట్స్మెన్ లేకపోవడంతో ఇంగ్లాండ్ ఛేజింగ్ సజావుగా సాగలేదు. బిల్లింగ్స్ 110 బంతుల్లో 118 పరుగులు(14 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 19 పరుగులతో విజయాన్ని అందుకుంది. ఆడమ్ జంపా నాలుగు వికెట్లు తీయగా, హాజెల్ వుడ్ 10 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. హాజెల్ వుడ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle