newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బంతిపై ఉమ్మి వేయడంపై నిషేధం తాత్కాలికమే.. ఐసీసీ చీఫ్ అనిల్ కుంబ్లే వివరణ

25-05-202025-05-2020 15:49:42 IST
Updated On 25-05-2020 15:52:36 ISTUpdated On 25-05-20202020-05-25T10:19:42.512Z25-05-2020 2020-05-25T10:19:40.405Z - 2020-05-25T10:22:36.911Z - 25-05-2020

బంతిపై ఉమ్మి వేయడంపై నిషేధం తాత్కాలికమే.. ఐసీసీ చీఫ్ అనిల్ కుంబ్లే వివరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బంతి ఉపరితలాన్ని మెరుగు తీసుకురావడం కోసం బంతిపై ఉమ్మి వేయడంపై తమ ప్యానెల్ విధించిన నిషేధం తాత్కాలికమేనని, ఇన్పెక్షన్లు కలిగే ప్రమాదాన్ని నివారించడం కోసమే ఇలా తాత్కాలిక నిషేధం విధించామని ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే వివరణ ఇచ్చారు. కరోనా నేపథ్యంలో క్రికెట్ పునరుద్ధరణపై గత శుక్రవారం మార్గదర్శక సూత్రాలను ప్రకటించిన ఐసీసీ బంతిపై ఉమ్మి వేయడం, నోటితో రుద్దడం చేయరాదని నిషేధం విధించింది. కానీ పలువురు బౌలర్లు ఈ నిషేధంపై అసంతృప్తి ప్రకటించిన నేపథ్యంలో ఐసీసీ తరపున తాజాగా కుంబ్లే వివరణ ఇచ్చారు.

బంతిని స్వింగ్ చేయాలంటే దానికి మెరుగు దిద్డడానికి ఉమ్మిని వేయడం తప్పనిసరని అనేకమంది బౌలర్లు వాదించారు. కానీ కరోనా నేపథ్యంలో అలా చేస్తే కచ్చితంగా ఇతర ప్లేయర్లకు అంటు సోకే ప్రమాదం ఉందని ఐసీసీ భావించింది. అయితే ఉమ్మికి బదులుగా లక్కవంటి పదార్థాన్ని ఉపయోగించి బంతికి మెరుగు తీసుకురావడానికి అనుమతించాలని బౌలర్లు చేసిన సూచనపై ఐసీసీ చర్చలు జరుపుతోంది. 

కానీ క్రికెట్ ఆటలో బంతిని మెరుగు తీసుకురావడానికి ఎలాంటి ఇతర పదార్దాలను అనుమతించకపోవడంపై తాము దృష్టి పెట్టామని గత కొన్నేళ్లుగా క్రికెట్ మైదానంలో జరుగుతూ వచ్చిన చేదు ఘటనలను అందరూ గుర్తుంచుకోవాలని కుంబ్లే పేర్కొన్నారు.

2018లో బాల్ టాంపరింగ్ కుంభకోణంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరోన్ బెన్ క్రాఫ్ట్‌లపై నిషేధం విధించిన విషయం మరవొద్దని కుంబ్లే హెచ్చరించారు.

కేంద్రం అనుమతిస్తేనే ఐపీఎల్‌

కాగా, ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌ భవిష్యత్‌పై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌ నిర్వహణ విషయంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలులేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టాక... కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఐపీఎల్‌ జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 

‘కరోనా వైరస్‌ వ్యాప్తి పరిస్థితుల ఆధారంగా భారత్‌లో ఐపీఎల్‌ నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. క్రీడా టోర్నమెంట్‌లు నిర్వహించాలనే ఏకైక కారణంతో ప్రజలందరి ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేము. ప్రస్తుతం మా దృష్టంతా కరోనా కట్టడిపైనే ఉంది’ అని కిరణ్‌ రిజిజు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ వాయిదా పడితే... అవే తేదీల్లో భారత్‌లో ఐపీఎల్‌ టోర్నీ నిర్వహించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle