newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

బంగ్లా ఆటగాళ్ళకు షాకిచ్చిన ఐసీసీ..

12-02-202012-02-2020 09:44:05 IST
Updated On 12-02-2020 10:07:36 ISTUpdated On 12-02-20202020-02-12T04:14:05.040Z12-02-2020 2020-02-12T04:14:02.809Z - 2020-02-12T04:37:36.486Z - 12-02-2020

బంగ్లా ఆటగాళ్ళకు షాకిచ్చిన ఐసీసీ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అండర్‌-19 వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్‌ అనంతరం అనంతరం చోటు చేసుకున్న ఘటన పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పోచెఫ్‌స్టూమ్ర్‌ వేదికగా ఆదివారం ఇండియా, బంగ్లాదేశ్ మధ్య పైనల్ మ్యాచ్‌ జరిగింది. టాస్ ఓడి ముందుగా యువ భారత్ బ్యాటింగ్‌ చేసింది. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడానికి భారత బ్యాట్స్‌మెన్లు ఇబ్బందులు పడ్డారు. బంగ్లా బౌలర్లు క్రమ తప్పకుండా వికెట్లు తీయడంతో భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగలకే ఆలౌట్ అయ్యింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన బంగ్లాదేశ్ వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి 41 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. వర్షం తెరిపినివ్వడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం బంగ్లాలక్ష్యాన్ని 170 పరుగులకు కుదించారు. ఈ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 42.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి చేధించింది.

కాగా మ్యాచ్‌ అనంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్లు సంబరాలు శృతి మించాయి. బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. మైదానంలోకి దూసుకొచ్చి.. నిరాశలో ఉన్న భారత క్రికెటర్లని కవ్విస్తూ సంబరాలు చేసుకున్నారు. కొందరు ఆటగాళ్లు హద్దు దాటి ప్రవర్తించారు. దీంతో భారత ఆటగాళ్లు కూడా ధీటుగా బదులిచ్చేందుకు ప్రయత్నించడంతో ఫీల్డ్ అంపైర్లు కలగజేసుకుని సర్దిచెప్పారు. అయినప్పటికీ.. బంగ్లాదేశ్ ఆటగాళ్లు వెనక్కి తగ్గకుండా అలానే కవ్వింపులని కొనసాగించారు.

ఈ ఘటన పై ఐసీసీ సీరియస్‌ అయ్యింది. జెంటిల్మెన్‌ గేమ్‌లో క్రీడాస్పూర్తిగా వ్యవహరించాలంటూ.. నిబంధనలను ఉల్లంగించిన ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. వీడియో పుటేజీలను పరిశీలించిన అనంతరం ఐదుగురు ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది. బంగ్లాదేశ్ జట్టులో తౌహిద్‌ హ్రిదోయ్‌, షమీమ్‌ హుస్సేన్‌, రకీబుల్ హసన్‌.. భారత జట్టులో ఆకాశ్ సింగ్‌, రవి బిష్టోయ్ లు ఐసీసీ నియమావళి ఉల్లగించినట్లు గుర్తించింది.

నియమావళిని ఉల్లగించినట్లు ఆటగాళ్లు అంగీకరించారని ఐసీసీ తెలిపింది. తాహిత్‌, షమీమ్‌, ఆకాశ్‌ సింగ్‌ కు ఆరు అయోగ్యత పాయింట్లు, రకీబుల్, బిష్ణోయ్‌ కు రెండు అయోగ్యత పాయింట్లు ఇచ్చింది.

ఐపీఎల్‌ ఆరంభానికి ముందే కరోనా  బోణీ.. రాజస్తాన్‌ ఫీల్డింగ్‌ కోచ్‌‌కు పాజిటివ్

ఐపీఎల్‌ ఆరంభానికి ముందే కరోనా బోణీ.. రాజస్తాన్‌ ఫీల్డింగ్‌ కోచ్‌‌కు పాజిటివ్

   12 hours ago


వాయిదా పడ్డ శ్రీలంక ప్రీమియర్ లీగ్.. తొలి ఏడాదే ఊహించని షాక్

వాయిదా పడ్డ శ్రీలంక ప్రీమియర్ లీగ్.. తొలి ఏడాదే ఊహించని షాక్

   12-08-2020


కొడుక్కి జరిమానా విధించిన తండ్రి

కొడుక్కి జరిమానా విధించిన తండ్రి

   12-08-2020


బుమ్రా మూడు ఫార్మట్లలో ఎక్కువకాలం ఆడలేడు.. షోయబ్ అక్తర్ జోస్యం

బుమ్రా మూడు ఫార్మట్లలో ఎక్కువకాలం ఆడలేడు.. షోయబ్ అక్తర్ జోస్యం

   12-08-2020


అదృష్టం అంటే ఎలా ఉంటుందో ఆరోజే సచిన్‌కు బాగా అర్థమైంది.. ఆశిష్ నెహ్రా

అదృష్టం అంటే ఎలా ఉంటుందో ఆరోజే సచిన్‌కు బాగా అర్థమైంది.. ఆశిష్ నెహ్రా

   11-08-2020


ఐసీసీలో కుదరని సయోధ్య.. ఏకాభిప్రాయం కోసం వెయిటింగ్

ఐసీసీలో కుదరని సయోధ్య.. ఏకాభిప్రాయం కోసం వెయిటింగ్

   11-08-2020


ఐపీఎల్ కి కేంద్రం అధికారిక అనుమతి

ఐపీఎల్ కి కేంద్రం అధికారిక అనుమతి

   11-08-2020


కోహ్లీని సింహంతో పోల్చిన ఆర్సీబీ.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

కోహ్లీని సింహంతో పోల్చిన ఆర్సీబీ.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

   11-08-2020


ఐపీఎల్ స్పాన్సర్ షిప్ టైటిల్ పతంజలికి దక్కేనా?

ఐపీఎల్ స్పాన్సర్ షిప్ టైటిల్ పతంజలికి దక్కేనా?

   10-08-2020


హాకీని వేధిస్తున్న మహమ్మారి.. మన్ దీప్ సింగ్‌కి కరోనా

హాకీని వేధిస్తున్న మహమ్మారి.. మన్ దీప్ సింగ్‌కి కరోనా

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle