ఫ్యాన్స్‌కు షాక్.. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్ బై
15-08-202015-08-2020 20:59:05 IST
Updated On 15-08-2020 21:05:08 ISTUpdated On 15-08-20202020-08-15T15:29:05.257Z15-08-2020 2020-08-15T15:28:59.592Z - 2020-08-15T15:35:08.549Z - 15-08-2020

తన అసంఖ్యాక అభిమానులకు జార్ఖండ్ డైనమైట్ షాకిచ్చాడు. ఊహించని ప్రకటన చేశాడు ధన్ ధన్ ధోనీ. టీమీండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్టు ధోని శనివారం ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించాడు. ఇన్నేళ్లు తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపాడు. ధోనీ రిటైర్మెంట్ పై ఈమధ్యకాలంలో విపరీతమయిన చర్చ జరిగింది. అయితే ఐపీఎల్ 2020 యూఏఇలో జరగనున్న నేపథ్యంలో ధోనీ నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని ఎవరూ ఊహించలేదు. ధోని సారథ్యంలో టీమిండియా అనూహ్య విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. వన్డే, టీ-20 ప్రపంచకప్‌లు సాధించింది. గతంలోనే టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగిన ధోని, టీ-20 వన్డే, జట్లలో ఆటగాడిగా కొనసాగాడు. 2004, డిసెంబర్ 23 బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అతడు క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ధోనీ ఊహించని నిర్ణయంతో యావత్ క్రీడా లోకం ఆశ్చర్యంలో మునిగింది. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోని ప్రస్తుతం జట్టు సభ్యులతో కలిసి దుబాయ్‌లో ఉన్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 10వరకు ఐపీఎల్ 2020 జరుగనుంది.

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
8 hours ago

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
18 hours ago

IPL 2021: అతడే మా తురుపుముక్క.. హర్షల్‌పై కోహ్లీ ప్రశంసలు
17 hours ago

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
10-04-2021

కోహ్లీ జాగ్రత్త..!
10-04-2021

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
10-04-2021

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021
ఇంకా