newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఫ్యాన్స్‌కి కోహ్లీ-అనుష్క గుడ్ న్యూస్.. ఏంటంటే?

27-08-202027-08-2020 12:41:53 IST
Updated On 28-08-2020 13:30:38 ISTUpdated On 28-08-20202020-08-27T07:11:53.325Z27-08-2020 2020-08-27T06:57:57.014Z - 2020-08-28T08:00:38.752Z - 28-08-2020

ఫ్యాన్స్‌కి కోహ్లీ-అనుష్క గుడ్ న్యూస్.. ఏంటంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పెళ్లయి ఇన్నాళ్లయింది గుడ్ న్యూస్ లేదా అంటారు కొత్త జంటని ఎవరైనా బంధువులు చూసినప్పుడు. ప్రేమించి పెళ్లిచేసుకున్న విరుష్క జోడీని కూడా చాలామంది ఇదే అడిగారు. అప్పుడు వారి దగ్గర సమాధానం లేదు.కానీ ఇప్పుడు అనుష్క-కోహ్లీ ఇంట్లోకి మరో మెంబర్ రాబోతోంది.

విరాట్ కోహ్లీ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయం వారే స్వయంగా ప్రకటించారు. అనుష్క ప్రెగ్నెన్సీ గురించి ట్వీట్ చేశాడు కోహ్లీ. ఫ్యాన్స్ అందరికీ పండుగలాంటి న్యూస్ ఇదే. అంతేకాదు అది ఎంతో దూరంలో లేదని, బేబీ బంప్ తో వున్న అనుష్క పిక్ షేర్ చేశాడు. 2021జనవరిలోనే అంటూ డెలివరీ గురించి కూడా చెప్చేశాడు. 

Image

'జనవరి 2021లో మేం ముగ్గురం కాబోతున్నాం'అనే క్యాప్షన్‌తో అనుష్కశర్మతో ఉన్న ఫొటోను విరాట్ షేర్ చేశాడు. ఈ ట్వీట్‌ను బట్టి చూస్తే ప్రస్తుతం అనుష్కకు 5వ నెల అని తెలుస్తోంది. ఈ వార్తతో విరాట్ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. విరాట్-అనుష్క జోడీకి అభినందనలు తెలుపుతున్నారు. ఇక అనుష్క కూడా తన ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో వారిద్దరి అభిమానులకు ఇది పండుగ రోజనే చెప్పాలి. వీరిద్దరి ప్రేమకు ప్రతిరూపం అయిన ఓ చిన్నారి వారింట తారట్లాడనుంది.

అటు సినిమాలతో అనుష్క, ఇటు క్రికెట్ టోర్నమెంట్లతో విరాట్ బిజీగా ఉండే వారు. వీరికి కరోనా లాక్ డౌన్ టైమ్ బాగా కలిసొచ్చింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సుమారు 5 నెలల పాటు ఇంటికే పరిమితమయ్యారు. ఓవైపు సినిమా షూటింగ్‌లు జరగక పోవడంతో అనుష్క కూడా భర్తతో కలిసి ఎంజాయ్ చేసింది.హెయిర్ డ్రెస్సర్ గా మారి విరాట్ హెయిర్ స్టయిల్ మార్చేసింది. 

ఈ విరామాన్ని వారిద్దరు బాగా ఆస్వాదించారు. సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పటికప్పుడూ టచ్‌లో ఉంటూ కరోనా కట్టడికి కృషి చేశారు. భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. అంతేకాదు వీరిద్దరు వివిధ పనుల్లో సాయం చేసుకున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ కోసం కోహ్లీ సిద్దమవుతుండగా... అనుష్క శర్మ కూడా అతనితో పాటే దుబాయ్ వెళ్లింది. ఈ కారణంగానే విరాట్ జట్టుతో కాకుండా ప్రత్యేక విమానంలో దుబాయ్‌కు వచ్చినట్లు అర్థమవుతుంది. 

ఇక పెళ్లైన భారత ఆటగాళ్లంతా ఇప్పటికే తండ్రులైన విషయం తెలిసిందే. ఇటీవలే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బాబు పుట్టగా.. అంబటి రాయుడుకి కూతురు జన్మించింది. విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని రాయల్‌ చాలెంజర్స్ ‌‌బెంగళూరు(ఆర్‌‌సీబీ) జట్టు ట్రెయినింగ్‌ క్యాంప్ ఇవాళ్టి నుంచి మొదలు కానుంది. ఆర్‌‌సీబీ టీమ్ ఆరు రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ బుధవారంతో ముగియనుంది. పెళ్లయి ఇన్నాళ్లయినా పిల్లల గురించి ఆలోచించరా అని ఈమధ్యే అభిమానులు ఈ జంటని ప్రశ్నించారు. కానీ అప్పుడీ సంగతి చెప్పలేదు. 

డిసెంబర్ 11, 2017న ఇటలీలో పెళ్లిచేసుకున్న విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle