newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఫుట్ బాల్ లెజెండ్ పీకె బెనర్జీ ఇక లేరు

20-03-202020-03-2020 17:23:26 IST
Updated On 20-03-2020 17:23:24 ISTUpdated On 20-03-20202020-03-20T11:53:26.812Z20-03-2020 2020-03-20T11:50:49.736Z - 2020-03-20T11:53:24.763Z - 20-03-2020

ఫుట్ బాల్ లెజెండ్ పీకె బెనర్జీ ఇక లేరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌, లెజెండరీ ఆటగాడు ప్రదీప్ కుమార్‌ బెనర్జీ అనారోగ్యంతో బాధపడుతూ ఆకస్మికంగా మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స అందుకుంటున్నారు. కాగా, శుక్రవారం కోల్‌కతాలో బెనర్జీ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. న్యూమోనియా కారణంగా శ్వాసకోశ సమస్యలతో సుదీర్ఘ కాలం పాటు ఆయన పోరాడారు. మార్చి 2 నుండి ఆసుపత్రిలోనే ఉన్నారు.

Image may contain: 3 people, text

ఫుట్ బాల్ ఆటగాడిగా భారత్‌కు ఎన్నో మరపురాని విజయాలు అందించారు. ఆటగాడిగానే కాదు, కోచ్‌గా కూడా జట్టుకు తన సేవలను అందించారు. జూన్ 23, 1936లో పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి శివార్లలోని మొయినాగురిలో ప్రదీప్ కుమార్‌ బెనర్జీ జన్మించారు. భారత్‌ తరుపున 84 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించి 65 గోల్స్‌ సాధించారు. 1962లో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో భారత్‌ స్వర్ణం గెలవడంలో బెనర్జీ కీలక పాత్ర పోషించారు. 1960లో జరిగిన రోమ్‌ ఒలింపిక్స్‌లో ఫ్రెంచ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ తరుపును ఏకైక గోల్‌ సాధించి మ్యాచ్‌ను డ్రా చేసేందుకు సహాయపడ్డారు. రోమ్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టుకు పీకే బెనర్జీనే సారథిగా వ్యవహరించారు.ప్రభుత్వం ఆయనకు అర్జున అవార్డు అందించింది. 

Image result for pk banerjee

 పీకే బెనర్జీ మరణం యావత్‌ క్రీడా ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. పీకే బెనర్జీ లేని లోటు తీర్చలేనిదని భారత మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.  ఈ సందర్భంగా ఆయనతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆయనతో దిగిన ఫోటోను సచిన్‌ తన ట్విటర్‌లో ఫోస్ట్‌ చేశారు. పీకే బెనర్జీకి ఇద్దరు కుమార్తెలు. ఆయన తమ్ముడు ప్రసూన్‌ బెనర్జీ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్నారు. పీకె బెనర్జీతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు సౌరవ్ గంగూలీ, బోనీ కపూర్, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు.

Image may contain: 15 people, text

Image may contain: 1 person, text


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle