newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఫుట్ బాల్ లెజెండ్ చునీ గోస్వామి కన్నుమూత

30-04-202030-04-2020 19:15:16 IST
Updated On 30-04-2020 19:30:06 ISTUpdated On 30-04-20202020-04-30T13:45:16.648Z30-04-2020 2020-04-30T13:44:16.352Z - 2020-04-30T14:00:06.740Z - 30-04-2020

ఫుట్ బాల్ లెజెండ్ చునీ గోస్వామి కన్నుమూత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ భారతీయ ఫుట్ బాల్ ఆటగాడు చునీగోస్వామి అనారోగ్యంతో పశ్చిమబెంగాల్ లో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన వయసు 82 ఏళ్ళు. షుగర్, ప్రొస్ట్రేట్, నరాల సమస్యలతో బాధపడుతున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

1962 ఆసియా గేమ్స్‌లో భారత ఫుట్ బాల్ జట్టుకు చునీ గోస్వామి నేతృత్వం వహించారు. అప్పుడు భారత జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. 1964లో రన్నరప్‌గా నిలిచింది. ఆ ఏడాది కూడా తృటిలో కప్పు బర్మా చేజిక్కించుకుంది. 1956 నుంచి 1964 వరకు చునీ గోస్వామి భారత ఫుట్ బాల్ జట్టు సుమారు 50 మ్యాచ్‌లు ఆడారు. ఆయన ఫుట్ బాల్ క్రీడాకారుడే కాదు. బెంగాల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ టోర్నమెంట్స్‌లో కూడా ఆడారు. 1962 నుంచి 1973 మధ్య 46 క్రికెట్ మ్యాచ్‌లో ఆడారు.

గడచిన రెండురోజులుగా విషాదాలు సినీ అభిమానులను వెన్నంటూతూనే వున్నాయి. క్యాన్సర్ తో బాధపడుతూ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు. ఈ విషాదం నుంచి తేరుకునేలోపు సీనియర్ నటుడు రిషి కపూర్ గురువారం ఉదయం ముంబైలో కన్నుమూశారు. కరోనా వైరస్ కారణంగా మహారాష్ట్రలో కేసులు ఉధృతంగా ఉండడంతో రిషి కపూర్ అంత్యక్రియలకు అతితక్కువమందిని మాత్రమే అనుమతించారు. బంధువులు, కుటుంబసభ్యుల్లో ఎక్కువమందికి అవకాశం కల్పించలేదు. రణధీర్ కపూర్, రణభీర్ కపూర్, అలియాభట్, అభిషేక్ బచ్చన్ వంటివారికి పోలీసులు అనుమతులు ఇచ్చారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle