newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

ఫిట్ గా అడితే.. 600 తీయడం ఖాయం

09-10-201909-10-2019 12:09:18 IST
Updated On 09-10-2019 12:38:36 ISTUpdated On 09-10-20192019-10-09T06:39:18.983Z09-10-2019 2019-10-09T06:39:15.242Z - 2019-10-09T07:08:36.996Z - 09-10-2019

ఫిట్ గా అడితే.. 600 తీయడం ఖాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తొమ్మిది నెలల తర్వాత విశాఖపట్నం టెస్టులో ఆడి అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్ సీనియర్ల ప్రశంసలు దక్కుతున్నాయి. అభిమానుల చప్పట్లు, ప్రశంసలు ఎలానూ ఉంటాయనుకోండి. దక్షిణాఫ్రికాతో జరిగిన విశాఖపట్నం టెస్టులో అశ్విన్ అద్భుతమైన ప్రదర్శనతో రెండు ఇన్నింగ్స్ లో కలిపి ఎనిమిది వికెట్లు తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టుల్లో తన రికార్డును బద్దలు కొడతాడని సీనియర్‌ ఆఫ్‌  స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ వ్యాఖ్యానించాడు.  

విశాఖపట్నం టెస్టులో అశ్విన్‌ మరో ఘనత సాధించాడు. 66 మ్యాచ్‌ల్లోనే 350 వికెట్లు తీసి శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ నెలకొల్పిన సంగతి తెలిసిందే. దానిని అశ్విన్ సమం చేశాడు.  దీని గురించి భజ్జీ మీడియాతో మాట్లాడుతూ అశ్విన్ ను పొగిడేశాడు. ‘‘అశ్విన్ బౌలింగ్ సామర్థ్యం గురించి అందరూ మాట్లాడుతుంటారు.  స్వదేశంలోనే అశ్విన్‌ బాగా బౌలింగ్ చేస్తాడని అంటుంటారు.  అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. ఇవే పిచ్‌లపై ఇతర స్పిన్నర్లూ బౌలింగ్‌ చేస్తున్నారు. మరి వాళ్లెందుకు రాణించలేకపోతున్నారు’’ అని టర్బోనేటర్ ప్రశ్నించాడు. 

భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా హర్భజన్‌ (417) ఉన్నాడు.  అనిల్‌ కుంబ్లే (619), కపిల్‌దేవ్‌(434) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అశ్విన్‌ ఇదే జోరు కొనసాగిస్తే కచ్చితంగా తన రికార్డు బద్దలు కొడతాడని హర్భజన్ అన్నాడు. అశ్విన్ పూర్తి ఫిట్‌నెస్‌తో దీర్ఘకాలం కెరీర్ కొనసాగిస్తే  600 వికెట్ల మైలురాయిని కూడా దాటేస్తాడని భజ్జీ చెప్పాడు. అశ్విన్‌ టెస్టుల్లో 350 వికెట్లు తీశాడు. స్వదేశంలో ఆడిన 39 మ్యాచ్‌ల్లో 242 వికెట్లు పడగొట్టగా... విదేశీ పిచ్ లపై 108 వికెట్లు తీశాడు. ఉపఖండంలో అయితే 46 మ్యాచ్‌ల్లో 285 వికెట్లు సాధించాడు.

అశ్విన్‌ స్పిన్ కు అనుకూలించే పిచ్లపైనే ఎక్కువ వికెట్లు తీశాడని.. తనకు, కుంబ్లేకు ఆ అవకాశం రాలేదని హర్భజన్‌ గతంలో ఒకసారి అన్నాడు. అశ్విన్ ఇతరుల కన్నా ఎక్కువ వికెట్లు ఎలా తీయగలుగుతున్నాడని భజ్జీ దగ్గర ప్రస్తావించగా... అతని నిలకడతత్వమే దానికి కారణమని చెప్పాడు. ‘‘అశ్విన్‌ బౌలింగ్‌లో వైవిధ్యం ఉంటుంది., పిచ్‌ మారేటప్పుడు ఎలా బౌలింగ్‌ చేయాలో అతడికి తెలుసు. పిచ్‌ స్వభావంపై అవగాహన ఉండాలి.  ఎప్పుడు ఎక్కడ ఎలా బంతి వేయాలో బౌలర్లకు తెలుసుండాలి. అది అశ్విన్ కి బాగా తెలుసు’’ అని హర్భజన్ చెప్పాడు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle