newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఫామ్‌లో లేకపోతే ఎవరైనా ఏమీ చేయలేరు.. కోహ్లీకి సెహ్వాగ్ సమర్థన

05-03-202005-03-2020 10:49:20 IST
2020-03-05T05:19:20.263Z05-03-2020 2020-03-05T05:19:16.795Z - - 17-04-2021

ఫామ్‌లో లేకపోతే ఎవరైనా ఏమీ చేయలేరు.. కోహ్లీకి సెహ్వాగ్ సమర్థన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూజిలాండ్ సీరీస్‌లో మూడు ఫార్మాట్లలో ఘోరంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి దేశంలోనూ, విదేశాల్లోనూ  సానుభూతిపూర్వకమైన మద్దతు లభిస్తూనే ఉంది. భారత దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా కోహ్లీకి మద్దతుగా రంగంలోకి దిగాడు. ప్రపంచంలో ఏ ఆటలోనైనా సరే ప్రతి ప్లేయర్‌కీ ఏదో ఒక సందర్భంలో చెడు దశ అంటూ ఒకటి ఎదురవుతూ ఉంటుందని కోహ్లీ కూడా దానికి భిన్నం కాదని కొట్టిపడేశాడు. 

సీనియర్ అయిన విరాట్ కోహ్లీ కంటి చూపు, బంతిని గమనించే దృష్టి తగ్గుముఖం పడుతున్నందున వీలైనంత ఎక్కువగా మైదానంలో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందంటూ మాజీ భారత కెప్టెన్ కపిల్ దేవ్ చెప్పిన అభిప్రాయాలతో తాను ఏకీభవించనని సెహ్వాగ్ పేర్కొన్నాడు. 

మీరు ఫామ్ కోల్పోయినప్పుడు ఏదీ మీకు అనుకూలంగా ఉండదు. విరాట్ సరైన ప్రయత్నం చేయడంలేదు కాబట్టే ఇలా విఫలమవుతున్నాడని చెప్పలేం. దురదృష్టం కోహ్లీని కూడా ఈసారి వెంటాడినట్లుంది అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. విరాట్‌కు చేయి-కన్ను సమన్వయానికి సంబంధించిన సమస్య ఉండకపోవచ్చు. ఒకవేళ అలాంటి సమస్య ఏర్పడి ఉంటే రాత్రికి రాత్రే అది బయటపడదు. నా ఉద్దేశంలో అది కోహ్లీ ఫామ్ కోల్పోయిన సమస్యే తప్ప మరొకటి కాదు. పైగా న్యూజిలాండ్ సీరీస్‌లో అతడు మంచి బంతులకే అవుట్ అయ్యాడు అని సెహ్వాగ్ వివరించాడు.

న్యూజిలాండ్ సీరీస్‌లో బంతి చాలాసార్లు వికెట్ మీదికి వచ్చింది. అలాంటి సందర్భాల్లో జట్టు ప్రణాళిక ప్రకారం తగినన్ని పరుగులు చేయలేకపోతే బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు రెట్టింపు అవుతాయి. ఏదేమైనా బంతిని మీరు వదిలివేస్తున్నప్పుడు ఫ్రంట్ ఫుట్‌పైనే ఎక్కువగా ఆడాల్సి ఉంటుంది. కోహ్లీకి ఇదే సమస్యగా తయారైందని సెహ్వాగ్ తెలిపాడు.

నాకు తెలిసినంతవరకు ఏ బంతిని ఆడాలి, ఏ బంతిని వదిలేయాలి అని గ్రహించడం చాలా ముఖ్యమైనది. మీరు ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నప్పుడు అలా ఆడటం సులభం. కానీ ఒత్తిడిలో ఆడుతున్నప్పుడు బంతిని అంచనా వేయడం కష్టమైపోతుంది. కోహ్లీ అందుకే వరుసగా దెబ్బతిన్నాడు అని సీరీస్ వైఫల్యం గురించి సెహ్వాగ్ విశ్లేషించాడు.

సచిన్ టెండూల్కర్, బ్రియన్ లారా, స్మిత్ తదితర దిగ్గజ ఆటగాళ్లు కూడా తమ కెరీర్‌లో ఏదో ఒకసమయంలో పరుగులు చేయలేక గింజుకున్నారు. కానీ వారు తర్వాత కోలుకుని అత్యుత్తమంగా ఆట ఆడారని  సెహ్వాగ్ గుర్తు చేశాడు.  నేను కూడా అలాంటి పరిస్థితికి లోనయ్యాను కానీ నా సహజమైన ఆట పట్ల రాజీపడకుండానే నేను కోలుకున్నాను. కష్టకాలాలను ఎదుర్కొంటున్నప్పుడు మీరు చాలా ఓపికగా ఉండాలి. మీ సహజ సహజాతాలను మళ్లీ తెచ్చుకోవాలి. కోహ్లీ తప్పకుండా తన ఫామ్‌ను దొరకబుచ్చుకుంటాడు అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

   14 hours ago


IPL 2021: కింద మీద పడి  గెలిచిన రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   15-04-2021


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   15-04-2021


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15-04-2021


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   15-04-2021


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   15-04-2021


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   15-04-2021


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   15-04-2021


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle